అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామ పంచాయతీల గ్రేడ్ల కుదింపు పై పంచాయతీ రాజ్ కమీషనర్ కార్యాలయంలో నిర్వహించిన అధికారిక సమావేశంలో గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా పాల్గొన్నారు.
తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమీషనరేట్ లో ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఓ.యస్.డి వెంకట కృష్ణ మరియు పంచాయతీ రాజ్ శాఖ డెప్యూటీ కమీషనర్ వర్రె.నాగార్జున సాగర్ ల అధ్యక్షతన ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలు మరియు పంచాయతీ కార్యదర్శుల గ్రేడ్లను ప్రస్తుతం గ్రేడ్ల నుండి మార్పు చేస్తూ స్పెషల్ గ్రేడ్ మరియు గ్రేడ్-1,2మరియు 3గా మార్పు చేసేందుకు జనాభా మరియు ఆదాయం ప్రాతిపదిక తీసుకోవడం గురించి మరియు పంచాయతీ కార్యదర్శి పేరు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా మార్పు చేయుట గురించి సమావేశం ఏర్పాటు చేసి ప్రతిపాదనలు చర్చించడం జరిగింది.
ఈ సమావేశంలో పాల్గొన్న గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా పంచాయతీ రాజ్ శాఖ ప్రత్తిపాదనలకు మొదటగా ధన్యవాదములు తెలియజేస్తూ పంచాయతీ కార్యదర్శి పేరు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా మార్పు చేయడాన్ని మరియు గ్రేడ్లు తగ్గించే ప్రతిపాదనను సంఘం తరపున స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
ఐతే,త్వరిత గతిన పదోన్నతులు కల్పించాలని,పంచాయతీ కార్యదర్శులకు మినిస్టీరియల్ పోస్ట్ లలో సైతం ఎంపిక చేసుకునేందుకు అవకాశం కల్పించాలని,అడిషనల్ గ్రేడ్-4 పంచాయతీలలో పనిచేస్తూ జీతాలు సమస్యలు ఎదుర్కొంటున్న కార్యదర్శులకు ఇతర ప్రాంతాలలో సర్దుబాటు చేసి జీతాలు అందేలా సమస్య పరిష్కారం చేయాలని,గ్రేడ్ల కుదింపుతో పాటు పే స్కేల్స్ పెంచాలని,పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-6 (డిజిటల్ అసిస్టెంట్ల)ను గ్రేడ్ల కుదింపు లో అవకాశం ఇవ్వాలని,లేదా వారికి టెక్నికల్ గా మెరుగైన పదోన్నతి కల్పించాలని కోరగా అధికారులు సానుకూలంగా స్పందించి త్వరిత గతిన వారి గురించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులు అందరికీ రూల్స్ ఆఫ్ సర్వీస్ అసోసియేషన్స్ (రోసా) ప్రకారం పంచాయతీ రాజ్ శాఖ తరపున ఎన్నికలు నిర్వహించి ఒక సంఘానికి గుర్తింపు ఇవ్వాలని మరియు పంచాయతీ శాఖ తరపున జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో ఒక సంఘం ఉండేలా సైతం చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.
ఉద్యోగ సంఘాల తరపున చేసిన సూచనలు మరియు శాఖ తరపున తయారు చేసిన ప్రతి పాదనలలో పొందు పరిచి ప్రభుత్వం ద్రుష్టికి తీసుకొని వెళ్ళి త్వరితగతిన వ్యవస్థ బలోపేతం కోసం కార్యదర్శులకు మేలు కలిగేలా నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Prajavartha Online Telugu News