రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త :
ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 19 వ తేదీన తిరుపతి లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో తిరుపతిలో పర్యటించనున్నారని పర్యటన ఏర్పాట్లను కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ముఖ్యమంత్రి తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా తూకివాకు వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ , అలిపిరి, పోలీస్ పెరేడ్ గ్రౌండ్ ప్రదేశాలలో పర్యటన భద్రత ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, మున్సిపల్ కమిషనర్ మౌర్య తో కలిసి పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్.. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఈ నెల జూలై 19 న ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి తిరుపతి లో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్ననున్నారని, భద్రత ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని కట్టుదిట్టంగా ఉండాలని తెలిపారు. విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Prajavartha Online Telugu News