Breaking News

చేనేత కార్మికులు జ‌గ‌నన్నఅండ‌…

-న‌గ‌ర పాల‌క సంస్థ మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కరోనా విజృంభణ నేప‌ధ్యంలో చేనేత కార్మిల‌కు అండ‌గా వైసీపీ ప్ర‌భుత్వం చేయూత నిచ్చింద‌ని న‌గ‌ర పాల‌క సంస్థ మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి పేర్కొన్నారు. బుధ‌వారం బంద‌రు రోడ్డులోని ర‌ఘ‌వ‌య్య పార్క్ బాపు మ్యూజియం లో స‌హ‌కార సంఘం అధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన చేనేత హ‌స్త‌క‌ళ ఎగ్జిబిష‌న్ ను మేయ‌ర్ సంద‌ర్శించారు. అనంత‌రం మేయ‌ర్ మాట్లాడుతూ కరోనా స‌మ‌యంలో ప‌నులు లేక ఇబ్బంది ప‌డుతున్న చేనేత‌, చిరు వ్యాపారుల‌కు అండ‌గా జ‌గ‌నన్న ప్ర‌భుత్వం చేయూత ద్వారా 24వేల రూపాయ‌ల న‌గ‌దు అంద‌జేయ‌డం వారికి చాలా ఉప‌యోగ‌ప‌డిందన్నారు. చేనేత హ‌స్త‌క‌ళ ఎగ్జిబిష‌న్ వ‌చ్చే నెల 12వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. స్టాల్స్‌లో నాణ్య‌మైన చీరాలు, జైపూర్ బెడ్‌షిట్స్‌, ఖాదీ ష‌ట్స్‌, సార‌గ్‌పూర్ పుడ్ ఐట‌మ్స్ బాగున్నాయ‌న్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *