Breaking News

జూలై 27 ఆదివారం ఎస్ జి టి, స్కూల్ అసిస్టెంట్ ఎయిడెడ్ టీచర్ పోస్ట్ ల భర్తీకి పరీక్ష. డి ఈ వో వాసుదేవరావు.

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కొంతమూరు లో ఉన్నఎస్తేరు ఏగ్జిన్ రెసిడెన్షియల్ ఎయిడెడ్ ఎలిమెంటరీ, మరియు హై స్కూల్ లో ఉన్న ఎస్ జి టి, స్కూల్ అసిస్టెంట్ లకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సి బి టి) ని జూలై 27 ఆదివారం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యా శాఖాధికారి కంది వాసుదేవరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు ఇందుకోసం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని,ఈ పరీక్షకు మొత్తం 1249 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లూ తెలియ చేశారు. కాకినాడలోని అయాన్ డిజిటల్ జోన్) అచ్యుతాపురం పరీక్షా కేంద్రంలో ఉదయం 9.30 గంటల నుండి 11.30 గంటల వరకు నిర్వహించే స్కూల్ అసిస్టెంట్ హోదా పరీక్షకు 486 మంది, అదే కేంద్రంలో మధ్యాహ్నం 2.00 గంటల నుండి 4.00 గంటల వరకు జరిగే ఎస్‌జీటీ హోదా పరీక్షకు 500 మంది అభ్యర్థులు హాజరుకానున్నారనీ తెలిపారు. రాజమహేంద్రవరం లూథరగిరిలోని పరీక్షా కేంద్రంలో జూలై 27 మధ్యాహ్నం 2.00 గంటల నుండి 4.00 గంటల వరకు జరుగనున్న ఎస్‌జీటీ పరీక్షకు 263 మంది అభ్యర్థులు హజరు కానున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ పై పేర్కొన్న పరీక్షా కేంద్రానికి పరీక్ష ప్రారంభానికి కనీసం ఒక గంట ముందుగానే హాజరై, అన్ని అవసరమైన ఒరిజినల్ గుర్తింపు పత్రాలతో సహా పరీక్షా నిబంధనలను అనుసరించాలని ఆయన సూచించారు. ఉదయం పరీక్ష 9.30 గంటలకు, మధ్యాహ్నం పరీక్ష 2.00 గంటలకు ప్రారంభమవు తాయన్నారు. ఈ పరీక్షకు సంబంధించిన మరిన్ని వివరాలకు 9848574622, 8309177952 నంబర్ల ను సంప్రదించవచ్చునని జిల్లా విద్యా శాఖాధికారి వాసుదేవరావు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *