రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. నెం. 23 ప్రకారం రాజమండ్రి రూరల్ నియోజక వర్గం పరిథిలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో భాగంగా క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించినట్లు రెవిన్యూ డివిజనల్ అధికారి ఆర్. కృష్ణ నాయక్ తెలియ చేశారు. బుధవారం రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరు గ్రామ పరిధిలో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న అర్హుల జాబితాను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని వివిధ గ్రామాల వారీగా దరఖాస్తుల వివరాలు, అర్హుల వివరాలు తెలియ చేయడం జరిగింది. రాజమండ్రున్రూరల్ మండలంలో వివిధ గ్రామ పంచాయతీలకు చెందిన ప్రజల నుంచి మొత్తం 2,129 దరఖాస్తులు అందయన్నారు. అందులో 1,572 (73.86%) దరఖాస్తులు అర్హులుగా గుర్తించడం జరిగిందన్నారు. గ్రామాల వారిగా అందుకున్న దరఖాస్తులు , వాటిలో అర్హత కలిగిన లబ్దిదారులు వివరాలు బొమ్మూరు 215 మందిలో 156 (72.56%) అర్హులు, ధవళేశ్వరం లో 421 మందిలో 271 ( 64.37%) అర్హులు , రాజవోలు 28 మందిలో 20 (71.43%) అర్హులు, సాటిలైట్ సిటీ 310 మందిలో 272 (87.74%) అర్హులు, పిడింగొయ్యి – 135 మందిలో 73 (54.07%) అర్హులు, హుకుంపేట లో 375 మందికి 366 ( 97.60%) అర్హులు, కాతేరు లో 227 మందిలో 168 (74.01%) అర్హులు, వెంకటనగరం 2 మంది కి 2 ( 100%) అర్హులు, కోలమూరు 305 మందికి 162 (53.11%) అర్హులు, తొర్రేడు 111 మందిలో 82 (73.87%) మంది అర్హులు ఉన్నట్లు తెలిపారు. వీటికి అదనంగా ఉన్న 144 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు తెలియజేశారు. రూరల్ పిఇదే సమయంలో 413 దరఖాస్తులు అనర్హులుగా తేలినట్లు రెవిన్యూ డివిజనల్ అధికారి తెలిపారు. అర్హుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆర్డిఓ వెంట రాజమండ్రి రూరల్ ఇన్చార్జి తాహాసిల్దార్ శ్రీనివాసరావు, ఇతర సిబ్బంది, ఉన్నారు.
Prajavartha Online Telugu News