-తూర్పు గోదావరిలో 3,801 మందికి కొత్తగా స్పౌస్ పెన్షన్లు మంజూరు
-ఆగస్టు ఒకటవ తేదీన 2,36,331 లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ కోసం రూ.1032.62 కోట్లు విడుదల
– జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా NTR భరోసా పింఛన్లు మరియు కొత్తగా మంజూరైన స్పౌస్ పెన్షన్ లబ్ధిదారులకు ఆగస్టు 1 వ తేదీన ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 2,36,331 లబ్ధిదారులకు రూ.1032.62 కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. పెన్షన్ పంపిణీ కోసం మునిసిపల్ కమిషనర్లు, మండల అభివృద్ధి అధికారులకు తగిన సూచనలు జారీ చేసినట్లు తెలిపారు.
మంజూరైన స్పౌస్ పెన్షన్ల సంబంధించిన వివరాలు:
రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల మేరకు తూర్పు గోదావరి జిల్లాలో 3,801 మందికి కొత్తగా జీవిత భాగస్వామి (స్పౌస్) పెన్షన్లు మంజూరు చేయగా, ఇందుకోసం జిల్లాకి రూ.1.52 కోట్లు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. స్పోస్ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రజా ప్రతినిధుల సమక్షంలో నిర్వహించనున్నట్లు, ఆమేరకు అధికారుల కి ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు.
స్పోస్ పెన్షన్ లబ్ధిదారులు:
రాజమహేంద్రవరం అర్బన్.. అత్యధికంగా 443 మందికి, రూ.17.72 లక్షలు స్పౌస్ పెన్షన్ల సంబంధించిన మంజూరు చేయడం జరిగిందనీ తెలియ చేశారు.
మండలాల వారీగా స్పౌస్ పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య:
అనపర్తి 169, బిక్కవోలు 194, చాగల్లు 137 , దేవరపల్లి 194, గోకవరం 158, గోపాలపురం 163, కడియం 184 ,. కోరుకొండ 223, కొవ్వూరు 140 , కొవ్వూరు (అర్బన్) 57 , నల్లజర్ల 168 , నిడదవోలు 157 , నిడదవోలు (అర్బన్) 70, పెరవలి 165 , రాజమండ్రి (అర్బన్) 443 , రాజమండ్రి (రూరల్) 284 , రాజానగరం 256, రంగంపేట 174 , సీతానగరం 187 , తాళ్లపూడి 109, ఉండ్రాజవరం 169 మంది.
NTR భరోసా పింఛన్ల విభాగాల వారీగా వివరాలు:
వృద్ధాప్య పింఛన్: 1,11,424 మందికి రూ.45.56 కోట్లు , వితంతువుల పింఛన్ 68,612 మందికి రూ.28.35 కోట్లు, దివ్యాంగుల పింఛన్ (రూ.6 వేలు) 31,892 మందికి రూ.19.47 కోట్లు , బెడ్‌రిడెన్ ఆరోగ్య పింఛన్ (రూ.15,000): 1,087 మందికి రూ.1.63 కోట్లు , కిడ్నీ, థలసీమియా, హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ బాధితులకు (రూ.10,000): 700 మందికి రూ.70 లక్షలు , అభయహస్తం (రూ.500) 5,782 మందికి రూ.29.92 లక్షలు ఈ కార్యక్రమం ద్వారా నిరుపేదలకు ఆర్థిక భద్రత కల్పించబడుతోందని కలెక్టర్ తెలిపారు. సకాలంలో, పారదర్శకంగా, ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేయడం కోసం మునిసిపల్, పంచాయతీ, సచివాలయ స్థాయి ఉద్యోగులు సమన్వయంతో పని చేయనున్నారని వివరించారు.
Prajavartha Online Telugu News