Breaking News

ఏపీ హజ్ యాత్రికుల కోసం*విజయవాడ*లో ఎంబార్కేషన్ కేంద్రం ఏర్పాటు

-కూటమి ప్రభుత్వం ప్రత్యేక వినతితో కేంద్రం నిర్ణయం
-విజయవాడ నుంచి వెళ్లే హజ్ యాత్రికులకు రూ. లక్ష రాష్ట్ర ప్రభుత్వ సహకారం
-హజ్- 2026 కు పకడ్బందీగా ప్రభుత్వం ఏర్పాట్లు
-రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ నుండి హజ్ యాత్ర -2026 వెళ్లే యాత్రికుల కోసం విజయవాడలో ఎంబార్కేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడించారు.ఈ మేరకు బుధవారం అమరావతి లో మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, మైనారిటీ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా కేంద్ర మైనారిటీ మంత్రిత్వ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు ల దుష్టికి ఏపీ హజ్ యాత్రికుల సౌకర్యార్థం విజయవాడలో ఎంబార్కేషన్ సెంటర్ ఏర్పాటు అవసరం,ఆవశ్యకతను తీసుకు వెళ్లడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వినతిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతున్నామని మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా హజ్ యాత్రికుల కోసం 17 ఎంబార్కేషన్ కేంద్రాలు ఉన్నాయని, అదనంగా విజయవాడలో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఏపీకి చెందిన హజ్ యాత్రికులు హైదరాబాద్, బెంగళూరు తదితర ఎంబార్కేషన్ కేంద్రాల నుండి హజ్ కు వెళ్లడం జరుగుతోందని, ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా అక్కడికి వెళ్లి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారం, సమన్వయంతో ఏర్పాట్లు చేయడం జరుగుతున్నదని వెల్లడించారు. మన రాష్ట్ర యాత్రికులు విజయవాడను ఎన్నుకుంటే మన ప్రభుత్వం వసతులు, సేవల ఏర్పాట్లు మరింత చక్కగా చేయడానికి వీలవుతుందని తెలిపారు. విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం నుంచి వెళ్లే ప్రయాణికులకు విమాన చార్జీల అదనపు భారం రూ.68,000 దాకా పడుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని విజయవాడ కేంద్రం నుంచి వెళ్లే యాత్రికులకు కూటమి ప్రభుత్వం రూ. లక్ష మొత్తాన్ని రాయితీగా అందిస్తుందని తెలిపారు. హజ్ -2026 కు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందని, రాష్ట్రం నుంచి వెళ్లే యాత్రికులందరూ విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం నుండి వెళ్లేందుకు మొదటి ప్రాధాన్యతగా ఎంచుకొని, చక్కని వసతులతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం అందించే రూ. లక్ష రాయితీ మొత్తాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఫరూక్ కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *