-రేపటి రోజున ఆయా నియోజకవర్గాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశం
-జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
చిత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గృహ నిర్మాణ రంగంలో పురోగతి సాధించాలి అని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో, పూతలపట్టు, జీడి నెల్లూరు, చిత్తూరు అర్బన్, నియోజకవర్గాల ఎన్టీఆర్ గృహ నిర్మాణాల పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ ఇంచార్జ్ సుబ్రహ్మణ్యం, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ప్రణాళికలో పేర్కొన్న లక్ష్యాలను సాధించడంలో అధికారులు నిబద్ధతతో కృషి చేయాలని తెలిపారు. నియోజకవర్గాలలో క్షేత్రస్థాయిలో హౌసింగ్ డిఈలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు గృహ నిర్మాణ అధికారులు క్రమం తప్పకుండా స్థల సందర్శనలు నిర్వహించి నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయడానికి అదనపు ప్రయత్నాలు చేయాలని ఆదేశించారు. జిల్లా అంతటా మొత్తం 73,098 ఇళ్లు మంజూరు చేయడం జరిగింది, వీటిలో 52 880 ఇల్లు పూర్తి చేయడం జరిగింది, 20,218 22,756 ఇళ్లు నిర్మాణం పనులు పూర్తి కావలసి ఉన్నది, మిగిలిన ఇళ్లు త్వరితగతిన పూర్తి కావలసి ఉన్నది సంబంధిత అధికారులు లబ్ధిదారులతో చర్చించి వారి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడంలో ఏవైనా సందేహాలు ఉంటే వాటిని పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు నిర్మాణం జరుగుతున్న నివాస ప్రాంతాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఇతరవిభాగాలలోనివారిసహచరులతో కలిసి పనిచేయాలని కలెక్టర్ గృహనిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. రేపటి రోజున కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల హౌసింగ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో, హౌసింగ్ అధికారులతో, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు, ఈ కార్యక్రమంలో ఆయా నియోజకవర్గాల హౌసింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News