-ఆర్డీఓ కె.మాధవి
తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాదికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు జిల్లా యంత్రాంగం సంయుక్తంగా నూతన తరహా న్యాయ సేవల శిబిరాన్ని (న్యూ మాడ్యుల్ లీగల్ సర్వీసెస్ క్యాంప్) లో భాగంగా ఆగస్టు 2వ తేదిన న్యాయ సేవా సదస్సును విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని తిరువూరు ఆర్డీఓ కె.మాధవి తెలిపారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న న్యాయ సేవా సదస్సుకు చేపట్టవలసిన ఏర్పాట్లపై గురువారం తిరువూరు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ మాధురి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆగస్టు 2వతేదిన ఏ కొండూరు మండలం గోపాలపురంలోని ఎస్ఎన్ కన్వెన్షన్ హాలులో న్యాయ సేవా సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు. సదస్సులో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, మాదక ద్రవ్యాల నిరోధకం వంటి పలు అంశాల పై చర్చించడం జరుగుతుందన్నారు. దీనితో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు పై లబ్దిదారులకు అవగాహన కల్పించవలసిన అవసరం ఉందన్నారు. ఇందుకు సంబంధించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న శాఖల చెందిన అధికారులు పథకాల సంక్షిప్త సమాచారంతో స్టాల్స్‌ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సమావేశంలో చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ స్కీం 2015, అవేర్నెస్, సపోర్ట్, హెల్ప్ అండ్ యాక్షన్ (ఆషా) 2025, డ్రగ్స్ అవేర్నెస్ వెల్నెస్ నావిగేషన్ స్కీం 2025, తో పాటు గవర్నమెంట్ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సదస్సులో మాదకద్రవ్యాల వినియోగం వలన ఎదురయ్యే సమస్యలు మాదకద్రవ్యాల నిర్మూలన తదితర అంశాలపై అవగాహన కలిగించడంతో పాటు బాధితులకు చట్టాలపై ప్రజలకు వివరించడం జరుగుతుందని ఆమె తెలిపారు.రెవెన్యూ, పోలీస్, డిఆర్‌డిఏ, పంచాయతీరాజ్ , మున్సిపల్ కార్పొరేషన్, స్త్రీ శిశు సంక్షేమం, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతుల సంక్షేమం, మైనార్టి సంక్షేమం, విద్య, వైద్య ఆరోగ్య, తదితర శాఖల అధికారులు సమన్వయంతో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి సదస్సును జయప్రదం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్డిఓ కే మాధురి కోరారు.
Prajavartha Online Telugu News