Breaking News

సి ఎస్ ఆర్ నిధులతో చేపట్టిన అన్ని పనులను సత్వరమే పూర్తి చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వివిధ మౌలిక సదుపాయాల కల్పన కోసం సమకూర్చిన సి ఎస్ ఆర్ నిధులతో చేపట్టిన అన్ని పనులను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ అధికారులను గీతాంజలి శర్మ అధికారులు ఆదేశించారు. సోమవారం సాయంత్రం నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశం మందిరంలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సిఎస్ఆర్ నిధుల వినియోగం పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ నీటి సరఫరా విభాగం ద్వారా అంగన్వాడీ కేంద్రాలలో నీటి నిలువ నిర్మాణాలు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాల కోసం 8.59 కోట్ల రూపాయల వ్యయంతో 53 పనులు మంజూరు చేయగా అందులో 35 పనులు పూర్తయ్యాయని, మరో 14 పనులు పురోగతిలో ఉన్నాయని, 4 పనులు ఇంకా మొదలుపెట్టలేదన్నారు.

ఏపీ ఈడబ్ల్యూ ఐడీసీ ద్వారా వివిధ పాఠశాలలు లో మౌలిక సదుపాయాల కల్పన కోసం 8.88 కోట్ల రూపాయల వ్యయంతో 21 పనులు మంజూరు చేయగా అందులో 13 పనులు పూర్తయ్యాయని, 6 పనులు పురోగతిలో ఉండగా 2 పనులు ఇంకా ప్రారంభం కాలేదన్నారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా 3 కోట్ల రూపాయల వ్యయంతో 7 పనులు మంజూరు కాగా అందులో ఇప్పటివరకు 3 పనులు పూర్తయ్యాయని, మరో 2 పనులు పురోగతిలో ఉన్నాయని, 2 పనులు ఇంకా మొదలు పెట్టలేదన్నారు. మిగిలిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సమావేశంలో సిపిఓ భీమరాజు, పంచాయతీరాజ్ ఎస్ ఈ రమణ రావు, ఆర్డబ్ల్యూఎస్ నటరాజు, ఐ సి డి ఎస్ పిడి ఎంఎన్ రాణి, ఏపీ ఈ డబ్ల్యూ ఐ డి సి ఈఈ రాయన్న తదితర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *