Breaking News

శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు విజయవాడ నగర ప్రజలకు ఎల్లప్పుడు ఉండాలి : కేశినేని జానకి

-బోనాలు స‌మ‌ర్పించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ స‌తీమ‌ణి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ :శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు విజ‌య‌వాడ న‌గ‌ర ప్ర‌జ‌ల‌పై ఎల్ల‌ప్పుడూ వుండాల‌ని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) స‌తీమ‌ణి జాన‌కి ల‌క్ష్మీ అమ్మ‌వారిని ప్రార్థించిన‌ట్లు తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజవర్గం చుట్టుగుంట ప్రాంతంలో ఆదివారం జ‌రిగిన శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి 37వ బోనాల సంబరాల్లో కేశినేని జానకి లక్ష్మీ పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఆల‌యానికి విచ్చేసిన కేశినేని జాన‌కి ల‌క్ష్మీ కి 26వ డివిజన్ కార్పొరేటర్ వల్లభనేని రాజేశ్వరి, ఆల‌య క‌మిటీ స‌భ్యులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం కేశినేని జాన‌కి ల‌క్ష్మీ ఆల‌యంలో ముత్యాలమ్మ అమ్మ‌వారికి బోనాలు స‌మ‌ర్పించి ప్ర‌త్యేక పూజాలు నిర్వ‌హించారు.

ఈ సందర్బంగా కేశినేని జానకి లక్ష్మీ మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి బోనాల సంబరాలుల్లో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందన్నారు.. రాబోయే రోజుల్లో విజయవాడ న‌గ‌రం మ‌రింత‌గా అభివృద్ధి చెందాలని, రాష్ట్ర ప్రజలు సుఖ, సంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్ధించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో 1వ, 26 డివిజ‌న్ల‌ క్ల‌స్ట‌ర్ ఇన్ చార్జ్ వల్లభనేని సతీష్,డివిజ‌న్ ప్రెసిడెంట్ తోట పాండు, సెక్ర‌ట‌రీ కారంపూడి స‌త్య, ఆల‌య‌క‌మిటీ స‌భ్యులతో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *