-డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకట రమణ
-పీజీఆర్ఎస్ ద్వారా 30 అర్జీలు స్వీకరణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పీజీఆర్ఎస్ లో అందిన ప్రతి అర్జీపై క్రియాత్మకంగా స్పందించి.. ప్రభుత్వ పనితీరు పట్ల అర్జీదారులలో నమ్మకాన్ని పెంపొందించాలని డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకట రమణ సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించగా.. మొత్తం 30 అర్జీలు వచ్చాయి. వీటిలో ఇంజనీరింగ్ కి సంబంధించి 20, రెవెన్యూకి సంబంధించి 3, టౌన్ ప్లానింగ్ కి సంబంధించి 5, వార్డు సచివాలయాలకు సంబంధించి రెండు ఉన్నాయి. ప్రతి అర్జీని నాణ్యతతో అర్జీదారుల సంతృప్తి కొలమానంగా పరిష్కార మార్గాలు చూపాలని డిప్యూటీ కమిషనర్ అన్నారు. గడువు దాటడానికి ఆస్కారం లేకుండా సకాలంలోనే అర్జీలను పరిష్కరించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఒకసారి అందిన అర్జీ మరలా పునరావృతం కాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో సెక్రటరీ జి.శైలజవల్లి, సిటీ ప్లానర్ జి.కోటయ్య, ఎస్ఈ(ఇంజనీరింగ్) ఎం.సీహెచ్.కోటేశ్వరరావు, ఎంహెచ్ఓ వినూత్న, మేనేజర్ ఎండి అబ్దుల్ మాలిక్, అన్ని విభాగాల హెచ్ఓడీలు, అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News