-జాయింట్ కలెక్టర్ తో కలిసి గోడ ప్రతులను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
-www.cara.wcd.gov.in వెబ్ సైట్ లో సమగ్ర సమాచారం అందుబాటులో
– కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
“ప్రతి పిల్లవాడికి ఒక ప్రేమతో కూడిన కుటుంబంలో పెరగాల్సిన హక్కు ఉందన్నారు, అయితే, కొన్ని కారణాల వల్ల పిల్లలు తల్లిదండ్రుల సంరక్షణ లేకుండా ఉంటారని, అలాంటి చిన్నారులకు తాత్కాలికంగా ఒక కుటుంబ వాతావరణాన్ని అందించేందుకు ప్రభుత్వం ఫోస్టర్ కేర్ కార్యక్రమాన్ని ప్రారంభించిందనీ జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ పిజి ఆర్ఎస్ సమావేశ మందిరంలో ఫోస్టర్ కేర్ ” గోడ ప్రతులను” జాయింట్ కలెక్టర్ ఎస్.. చిన్న రాముడు తో కలిసి జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, 6 నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలను ఫోస్టర్ తల్లిదండ్రులు 2 సంవత్సరాల పాటు తమ ఇళ్లలో పెంచి, వారికి ప్రేమ, ఆప్యాయత, భద్రతతో కూడిన జీవితాన్ని అందించవచ్చు అని పేర్కొన్నారు. ఫోస్టర్ కేర్ కార్యక్రమాన్ని అనుసరించి రెండేళ్ల పాటు ఆయా పిల్లల సంరక్షణ విషయంలో బాధ్యత తీసుకున్న తల్లితండ్రులు తదుపరి నిర్ణిత గడువు ముగిసిన తర్వాత శాశ్వత దత్తతకు దారితీసే అవకాశముందన్నారు. ఫోస్టర్ కేర్ కోసం ముందుకు వచ్చే వారు ఎటువంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు. మిషన్ వాత్సల్య పథకం కింద ఆయా పిల్లల సంరక్షణ కోసం మిషన్ వాత్సల్య పథకం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60 : 40 నిష్పత్తిలో ప్రతి పిల్లకు నెలకు 4,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయ బడుతుందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు లేని వారు, నిర్ణిత ఆధారాలు చూపించి, మీ ఇంటి తలుపు ఒక చిన్నారికి కొత్త ఆశ, వెలుగు తీసుకునీ రావడం కోసం నిర్దేశించినట్లు పేర్కొన్నారు. ఫోస్టర్ తల్లిదండ్రులుగా మారి, ఒక పిల్లవాడి జీవితంలో సుస్థిరమైన మార్పు తీసుకురాగలరు” అనే ఆశాభావన్నీ కలెక్టర్ వ్యక్తం చేశారు.
మరిన్ని వివరాల కోసం సంప్రదించండి:
జిల్లా బాలల పరిరక్షణ విభాగం 8330969889 (DCPU) మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ, తూర్పు గోదావరి జిల్లా, 93980 55826 బాలల సంరక్షణ అధికారి 9010666795 www.cara.wcd.gov.in లేదా మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ అధికారి కార్యాలయం, బొమ్మూరు రాజమహేంద్రవరం రూరల్ 533124 ను సంప్రదించాలని ఐసిడిఎస్ పిడి టి. శ్రీదేవి తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు, డి.ఆర్.ఓ టి. సీతారామ మూర్తి, డీఎస్పీ భవ్య కిషోర్, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి టీ. శ్రీదేవి, సిపివో ఎల్. అప్పలకొండ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భాగ్యలక్ష్మీ, డిఎల్ డివోలు పి. వీణాదేవి, ఏ. స్లీవా రెడ్డి తదితరులు పాల్గొన్నారు .
Prajavartha Online Telugu News