రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఎంపీడీవోలు, తహసీల్దార్లు, జిల్లా అధికారులు పాల్గొన్న దృశ్యమాధ్యమ సమావేశంలో కీలక సూచనలు చేశారు. కలెక్టర్ పి. ప్రశాంతి పిలుపునిచ్చి, “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమాన్ని తూర్పు గోదావరి జిల్లా లోని అన్ని మండలాల్లో తప్పక నిర్వహించాలని తహసీల్దారులను ఆదేశించారు. చిన్నపిల్లలు, సైనికులు, వృద్ధులు, ప్రజా ప్రతినిధులు సహా అందరిని ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా చేయాలని తెలిపారు. అమృత్ సరోవర్ ప్రాజెక్టులు, నెహ్రూ యువ కేంద్రాలు, మోడల్ గ్రామ పంచాయతీలు, పాఠశాలల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా, సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేసి, వీడియోలను అధికారిక వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయాలని స్పష్టం చేశారు. గృహ నిర్మాణాలు వేగంగా పూర్తి చేయడానికి ఎంపీడీవోలపై బాధ్యత ఉందని, నగదు అందిన తర్వాత కూడా నిర్మాణాలు ఆలస్యమవుతున్న కారణాలు తెలుసుకోవాలని సూచించారు. కొందరు అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, 800 మియావకి మొక్కలు నాటిన రాజానగరం ఎంపీడీవోకు అభినందనలు తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం సమస్యలు, ఆధార్ నంబర్ సీడింగ్ లో తప్పుడు వివరాలు సరిచేయడం, ఎన్పీసీఐ వెంటనే యాక్టివేట్ చేయడం వంటి విషయాలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. వెబ్ ల్యాండ్ లో ఉండే తప్పులు పాసుపుస్తకాలలో సమస్యలుగా మారకుండా వాటిని సరిదిద్దాలని, ముద్రణలో దొర్లిన తప్పులను గుర్తించి సరిచేయాలని కలెక్టర్ చెప్పారు. రీ సర్వే రెండవ దశలో చురుకైన పనితీరు ఉండాలని, ఈ నెలాఖరులో నీటి తీరువా పన్ను చెల్లింపు సమయానికి జరగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ చిన్న రాముడు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్. భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News