తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను నిలుపుదల చేయండి… ఆంధ్రా రైతుల నీటి హక్కులను కాపాడండి…

-కె.ఆర్.ఎం.బి. కి విజ్ఞప్తి చేసిన సాగు నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణా రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాలమధ్య కృష్ణా నదీజలాల వివాదం, కేంద్రప్రభుత్వం ప్రకటించిన గజెట్ అమలుపై రేపు హైదరాబాద్ లో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కె.ఆర్.ఎం.బి.) సమావేశం జరుగుతున్న నేపథ్యం లో శ్రీశైలం ఎగువ భాగాన తెలంగాణ ప్రభుత్వం ఏవిధమైన అనుమతులు లేకుండా చేపడుతున్న కొత్త ప్రాజెక్టులను నిలుపుదల చేసి ఆంధ్రా రైతుల నీటి హక్కులను కాపాడాలని మంగ‌ళ‌వారం కె.ఆర్.ఎం.బి. చైర్మన్ ఎంపీ సింగ్ కు ఈ-మెయిల్ ద్వారా సాగు నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ పూర్తి వివరాలతో వినతిపత్రం సమర్పించింది. ఇదే విషయమై మంగ‌ళ‌వారం విజయవాడ గాంధీ నగర్ లోని ప్రెస్ క్లబ్ లో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆళ్ళ వెంకట గోపాల కృష్ణ రావు పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా శ్రీశైలం ఎగువ బాగాన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 కు వ్యతిరేకం గా సి. డబ్ల్యూ. సి., కె.ఆర్.ఎం.బి., ఎపెక్స్ కౌన్సిల్ నుంచి ఏవిధమైన అనుమతులు లేకుండా 105 టీఎంసీలతో ఎస్ ఎల్ బి సి,కల్వకుర్తి, నెట్టెంపాడు తదితర ప్రాజెక్టుల విస్తరణ, 150 టీఎంసీలతో పాలమూరు-రంగారెడ్డి, భక్తరామదాసు, తుమ్మెల్ల, మిషన్ భగీరథ తదితర కొత్త ప్రాజెక్టులు కలిపి మొత్తం 255 టీఎంసీలతో ప్రాజెక్టులు చేపడుతుందని, ఇవి పూర్తయితే వర్షాభావ పరిస్తుతులుఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువల కింద ఉన్న 15 లక్షల ఎకరాల ఆయకట్టు, కృష్ణా డెల్టా కింద ఉన్న 13 లక్షల ఎకరాల ఆయకట్టు, ఎస్ ఆర్ బి సి కింద ఉన్న రెండు లక్షల ఎకరాల ఆయకట్టు తో కలిపి మొత్తం 30 లక్షల ఎకరాల ఆయకట్టుకు చుక్క నీరు రాక బీడుబారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.అట్లాగే శ్రీశైలం దిగువ భాగాన ఆంధ్రప్రదేశ్ కు 385 టీఎంసీలు, తెలంగాణకు 121 టిఎంసిలు వాడుకునే హక్కు ఉండగా తెలంగాణ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా, మూర్ఖత్వంగా శ్రీశైలం , నాగార్జున సాగర్, పులిచింతల లో విద్యుత్ ఉత్పత్తి చేసి సముద్రంలోకి సాగు నీరును వదిలి వేస్తుందని, దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే 2015 లో రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందం ప్రకారం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 811 టీఎంసీలలో ఆంధ్రప్రదేశ్ కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారని దీని ప్రకారం ఆంధ్రాకు నీటి పంపిణీ లో 70 శాతం, తెలంగాణకు 30 శాతం మాత్రమే కేటాయింపులు ఉండగా ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం మూర్ఖత్వంగా 50-50 శాతం ఇరు రాష్ట్రాలకు కేటాయింపులు చేయాలనే వాదన సహేతుకం కాదని దీన్ని అడ్డుకోవాలని, అట్లాగే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గెజిట్ లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం 11వ షెడ్యూల్లో ఉన్న వెలిగొండ ప్రాజెక్టును చేర్చాలని, పూర్తిగా ఆంధ్రా భూభాగంలో ఉండి వివాదంలో లేని ప్రకాశం బ్యారేజిని గెజిట్ నుంచి తొలగించడానికి చర్యలు తీసుకోవాలని కె ఆర్ ఎం బి చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల శక్తి శాఖకు కె ఆర్ ఎం బి కి విన్నవించిన విధంగా కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కృష్ణ బేసిన్ విజయవాడలో ఏర్పాటు చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కే ఆర్ ఎం బి ని కోరారు. అంతిమంగా రేపు జరిగే కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశంలోనూ కేంద్ర గెజిట్ అమలుపై కె.ఆర్.ఎం.బి.,జి ఆర్ ఎం బి ఉమ్మడి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్థ వాదనలు వినిపించి శ్రీశైలం ఎగువ భాగాన తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులకు అడ్డుకట్టవేసి ఆంధ్రా రైతుల నీటి హక్కులను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నీటి సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగార్జునసాగర్ ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ యనమద్ది పుల్లయ్య చౌదరి(కృష్ణాజిల్లా), కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ మాజీ చైర్మన్ మైనేని మురళీకృష్ణ( గుంటూరు జిల్లా), కృష్ణా తూర్పు డెల్టా ప్రాజెక్ట్ కమిటీ మాజీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ( కృష్ణాజిల్లా), కార్యవర్గ సభ్యులు గుండపనేని శ్రీనివాసరావు, తుమ్మల లక్ష్మణరావు,బొర్రా అశోక్ కుమార్, మైనేని వెంకట నరేంద్ర , తుమ్మల నాగేశ్వరరావు,(కృష్ణా జిల్లా), నెక్కంటి కాళికేశ్వరావు( పశ్చిమ గోదావరి జిల్లా), దావులూరి వెంకటేశ్వర్లు( ప్రకాశం జిల్లా) తదితరులు పాల్గొన్నారు

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *