విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తమ కళాశాల కు చెందిన ఇద్దరు డిగ్రీ విద్యార్థినులు ఇంటర్నేషనల్ సర్వీస్ లెర్నింగ్ ఫెలోషిప్ కు ఎంపిక చేయబడి ఫిలిప్పీన్స్ లో యూనివర్సిటీ ఆఫ్ సేన్ కార్లోస్ , సేబు సిటీ లో ముగించుకుని ఇండియా కు వచ్చిన సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మరియు యాజమాన్యం వారిని సత్కరించింది. ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ జసింత క్వాడ్రస్ మాట్లాడుతూ కె.కాంతి పునీత డిగ్రీ బయోటెక్నాలజీ, జి శ్వేత బి. ఎ హిస్టరీ ఈ ఇద్దరు స్టూడెంట్స్ సర్వీస్ లెర్నింగ్ ఫెలోషిప్ లో భాగం గా ఆగస్టు 3వ తేది నుండి ఆగస్టు 11వ తేదీ వరకు ఫిలిప్పీన్స్ కొంజరిగిన కాథలిక్ కమ్యూనిటీస్, మరియు ఇతర కమ్యూనిటీస్ పై అవగాహన మరియు సమాజ అవసరాలలో యువత పాత్ర సమాజ అవసరాలకు అనుగుణంగా యాక్షన్ ప్లాన్స్ తీసుకోవటం మరియు లోకల్ కమ్యూనిటీస్ పై అధ్యయనం మరియు సహాయం అందచేయటం తదితర అంశాలపై శిక్షణ పొందారని, ఈ ప్రతిష్టాత్మకమైన ఫెలోషిప్ పొందటం వల్ల తమ కళాశాలకు ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలను. తీసుకువచ్చారని తమకు ఇది గర్వ కారణమని ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ జసింత క్వడ్రస్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ సిస్టర్ ఇన్నాసియా, జి. ఉష కుమారి డిగ్రీ వైస్ ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులు విద్యార్థినులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News