Breaking News

సామాన్యుడు నుంచి ఒక సంస్థకు చైర్మన్ గా నియామకం

-ముఖ్యమంత్రి ఆశయాల మేరకు శక్తి వంచన లేకుండా పనిచేస్తా
-గత 5 సంవత్సరాలు ప్రజల కోసం అనేక పోరాటాలు చేసా
-వలవల మల్లిఖార్జునరావు (బాబ్జీ), ఆంధ్రప్రదేశ్ భవన మరియు నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సామాన్యుడుగా ఉన్న నన్ను ముఖ్యమంత్రి ఎన్నో పదవులు ఇచ్చి ప్రోత్సహించారని ఆంధ్రప్రదేశ్ భవన మరియు నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లిఖార్జునరావు (బాబ్జి) తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భవన మరియు నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ గా వలవల మల్లిఖార్జునరావు (బాబ్జి) గురువారం తాడేపల్లిలోని శ్రీనివాస కన్వెన్షన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చైర్మన్ వలవల మల్లిఖార్జునరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ భవన మరియు నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ గా నన్నునియామకం చేయడం సంతోషంగా ఉందని, అందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. నా సాయశక్తులా ఆ పదవికి వన్నె తెస్తానన్నారు. కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం నా శక్తి వంచన లేకుండా పనిచేసి వారికి న్యాయం చేస్తానన్నారు. అంతేకాకుండా నాయకుడు పిలుపును అందుకుని పనిచేయడమే లక్ష్యంగా అలవాటు చేసుకున్నానన్నారు. నాకు పదవి రావడంలో నాకు అండగా ఉన్న నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. తాడేపల్లిగూడెం కు చెందిన ప్రతి ఒక్కరూ నా వెంటే నిలవటం నేను ఎప్పటికీ మరువలేనన్నారు. నాకోసం తాడేపల్లిగూడెం నుంచి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. గత 5 సంవత్సరాలు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశామన్నారు. నేను చేసిన అన్ని పోరాటాల్లో నియోజకవర్గానికి చెందిన ప్రజలు నావెంటే నిలిచి నాతో కలిసి వచ్చారన్నారు.. ముందుగా స్టేజీ పై ఉన్న స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి నాయకులు పుష్పాంజలి ఘటించారు. ఆంధ్రప్రదేశ్ భవన మరియు నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ గా వలవల మల్లిఖార్జునరావు ఉదయం 11 గంటలకు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు…

విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి వల వల మల్లిఖార్జునరావు అన్నారు. కూటమి పొత్తులో భాగంగా మల్లిఖార్జునరావు కు ఎమ్మెల్యే టికెట్ రాలేదని, దాని పర్యవసానంగానే ఇప్పుడు చైర్మన్ పదవి వచ్చిందన్నారు. కూటమి సభ్యుల్లో ఏమైనా సమస్యలు ఉంటే అందరూ కూర్చుని మాట్లాడుకుని పరష్కరించుకోవాలన్నారు. నా ధృష్టికి వచ్చిన అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్ భవన మరియు నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ గా వలవల మల్లిఖార్జునరావు ఇంకా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారని ఆశిస్తున్నానన్నారు.

కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ కార్మిక శాఖలో 3 బోర్డులు ఉంటాయన్నారు. కార్మిక సమస్యలు మీద ఆ బోర్డుకు ఉన్న ప్రాముఖ్యత పై ఆలోచించి వలవల మల్లిఖార్జునరావుకు చైర్మన్ పదవిని అందించారన్నారు. గత ప్రభుత్వంలో ఈ బోర్డును విచ్ఛిన్నం చేశారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సరైన సంస్థకు చైర్మన్ గా మల్లిఖార్జునరావును నియమించారన్నారు. గత 5 సంవత్సరాలు చైర్మన్ వలవల మల్లిఖార్జునరావు ఎన్నో పోరాటాలు చేశారన్నారు. నియోజకవర్గంలో అన్న క్వాంటీన్లను రద్దు చేసినా ఈయన ఎంతో మంది సహకారంతో నిర్వహించారన్నారు.

మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ఒక మంచి నాయకుడుకి ఒక మంచి పదవి ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు అందించటం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా ఆ పిలుపును అందుకుని మల్లిఖార్జునరావు పనిచేశారన్నారు.

మాజీ మంత్రి, శాసనసభ్యులు పితాని సత్యన్నారాయణ మాట్లాడుతూ కార్మికులకు సమస్యలు మీద పోరాటం చేయడంలో ఆయనకు ఆయనే చాటి అని అన్నారు.

కార్యక్రమంలో శాసనసభ్యులు మద్దిపాటి వెంకట్రాజు, బడేటి రాధాకృష్ణ, నాయకులు ఆదిరెడ్డి అప్పారావు, గన్ని వీరాంజనేయులు, ఎపి టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, తదితర నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *