అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో అర్హతగల ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా ఫించన్ అందించాలని ఎక్కడైనా అర్హత ఉండి ఫించన్ రాలేదని ఫిర్యాదు వస్తే అందుకు సంబంధిత జిల్లా కలక్టరే బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్పష్టం చేశారు. మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు,భుగర్భ జలాలు,పియం కుసుమ్ పధకానికి భూ సంబంధిత అంశాలు, పింఛన్లు, జిల్లా జువెనైల్ జస్టీస్ కమిటీల ఏర్పాటు వాటి అమలు,ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధిత అంశాలపై గురువారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.ముందుగా పింఛన్లు పంపిణీపై సిఎస్ మాట్లాడుతూ అర్హత గల ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పెన్షన్ అందేలా చూడాలని కలెక్టర్లుకు స్పష్టం చేశారు.ప్రతినెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు,జిల్లా,మండల ప్రత్యేక అధికారులు తప్పక పాల్గొనాలని ఆదేశించారు.పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని అర్హత గలవారందరికీ తప్పనిసరిగా ఫించన్ అందేలా చూడలాని అర్హత ఉన్నా ఫించన్ రాలేదని మీడియా,సోషల్ మీడియా లేదా మరే ఇతర మార్గాల్లోనైనా ఫిర్యాదులు వస్తే అందుకు ఆయా జిల్లా కలక్టర్లే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని సిఎస్ విజయానంద్ పునరుద్ఘాటించారు.
పెన్షన్ల తనిఖీకి సంబంధించి లక్షా 35 వేల మందికి నోటీసులు జారీ చేసి నెలరోజుల్లోగా ఎంపిడిఓలకు అప్పీళ్ చేసుకోవాలని తెలియజేయాగా వారిలో 88వేల 319 మంది ఎంపిడిఓలకు అప్పీలు చేసుకోగా ఇంకా 23వేల మంది అప్పీలు చేసుకోలేదని నెలరోజుల గడువులోపు అప్పీళ్ళన్నీ పరిష్కరించాలని కలక్టర్లను సిఎస్ ఆదేశించారు.పెన్షన్ల పంపిణీపై ఎక్కడా నెగిటివ్ ప్రసారం రాకుండా చూసుకోవాలని అర్హతగల వారందరికీ తప్పనిసరిగా ఫెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.అంతకు ముందు మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, భూగర్భ జలాల పెంపు,పియం కుసుమ్ ఫధకానికి సంబంధించి భూసంబంధిత అంశాలు,జిల్లా జువనైల్ జస్టీస్ కమిటీలు ఏర్పాటు,యూరియా లభ్యత తదితర అంశాలపై కలక్టర్లతో సిఎస్ సమీక్షించారు.
ఈసమావేశంలో సిసిఎల్ఏ జి.జయలక్మి,ఆర్టీజిఎస్ సిఇఒ ప్రఖర్ జైన్,ఐఅండ్పిఆర్ డైరెక్టర్ హిమాన్షు శుక్ల, వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు,నెడ్ క్యాప్ ఎండి కమలాకర్ బాబు తదితర అధికారులు పాల్గొన్నారు.అదే విధంగా రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్,సెర్ప్ సిఇఓ కురుణ,మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శి సూర్యకుమారి,వివిధ జిల్లాల కలెక్టర్లు వర్చువల్ గా పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News