– రూ.4.9 కోట్ల క్రీడా ప్రోత్సాహకాలు విడుదల
– 43 మంది అంతర్జాతీయ క్రీడాకారులకు లబ్ధి
– సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన శాప్ ఛైర్మన్ రవినాయుడు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత వైసీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిన రూ.4.9కోట్ల క్రీడా ప్రోత్సాహకాలను కూటమి ప్రభుత్వం విడుదల చేసి ఏపీలోని క్రీడాకారులకు తీపికబురు చెప్పిందని శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా రూ.4కోట్ల 9లక్షల 2వేలు బకాయిలను విడుదల చేయడం సంతోషదాయకమని పేర్కొన్నారు. దీనివల్ల ఏపీలో 43మంది అంతర్జాతీయ క్రీడాకారులకు లబ్ధి చేకూరిందని, తద్వారా వారు క్రీడల్లో మరింత రాణిచ్చేందుకు ఈ ప్రోత్సాహకాలు ఉపయోగపడతాయని వివరించారు. క్రీడలు, క్రీడాకారుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకుందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారులందరూ సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాప్రోత్సాహకాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి క్రీడాకారుల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
లబ్ధి పొందిన క్రీడాకారులు..
కిదాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్, ధీరజ్ బొమ్మదేవర, షేక్ జాఫ్రిన్, షేక్ సాథియా ఆల్మస్, ఎ.అజయ్ కుమార్ రెడ్డి, డి.గ్రీష్మ, ఎం.సాహితి వర్షిని, ఏ శివనాగిరెడ్డి, రాయుడు అరుణ్ కుమార్, ఎ.సాయిసంహితి, కె.మోహన్ కిరణ్ కుమార్, కె.నారాయణ, కె.సంధ్య, ఎమ్.సత్యవతి, వి.రావణి, డి.వెంకటేశ్వర్, రియాజ్ సాబూ, గంపా ఆదిత్య వరుణ్, వి.మౌనిక, నాగ జ్ఞానదివ్య, మొదలగు వారు ఉన్నారు.
Prajavartha Online Telugu News