Breaking News

ఆచంట నియోజకవర్గంలో పెనుమంట్ర మండలం లో రూ.3 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం…

-మల్లిపూడి, జుత్తిగ, భట్లమగుటూరు గ్రామాల్లో మంత్రుల సుడిగాలి పర్యటన

పెనుమంట్ర, నేటి పత్రిక ప్రజావార్త :
మన రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం తో పాటు అభివృద్ధి కి కూడా అత్యధిక ప్రాధాన్యత నిస్తోందని మంత్రులు మేకతోటి సుచరిత, శ్రీరంగనాధ రాజు, తానేటి వనిత లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇచ్చిన హామీల అమలు చేస్తూ చిత్తశుద్ధితో సంక్షేమ పాలనను అందిస్తోందన్నారు. ఆదివారం పెనుమంట్ర మండలం పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొన్నారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేద నిరుపేదల కు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే, మరోపక్క అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. దిశా యాప్ ను రూపొందించి మహిళ ల భద్రత కు భరోసా కల్పించామన్నారు. ప్రజలకు మరింత మేలైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశా మన్నారు. తమది మహిళా, రైతు సంక్షేమ ప్రభుత్వమన్నారు. ఆదిశలోనే సంక్షేమ కార్యక్రమాలు ప్రయోజనం మహిళల ఖాతాలో జమచేసమన్నారు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ, పెద్ద ఎత్తున రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు. రాష్ట్రంలో తొలిదశలో 15 లక్షల ఇళ్ళ ను నిర్మాణం చేస్తున్నామని, 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు అందించి వారి స్వంత ఇంటికల నెరవేర్చామన్నారు. రాష్ట్రంలో 46 లక్షల మంది మహిళలు దిశయాప్ ను డౌన్లోడ్ చేసుకోవడం జరిగిందన్నారు. మహిళలే కాదు ప్రతి ఒక్కరూ దిశయాప్ డౌన్లోడ్ చేసుకోవాలని, అపద సమయాల్లో తగిన రక్షణ పొందాలని విజ్ఞప్తి చేశారు.

స్థానిక శాసన సభ్యులు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ రాజు మాట్లాడుతూ, ఈరోజు పెనుమంట్ర మండలం పరిధిలో మల్లిపూడి, జుత్తిగ, భట్లమగుటూరు గ్రామాల్లో చేపట్టి పూర్తి చేసిన రూ.3 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించి ప్రజలకు అందుబాటులో కి తీసుకుని వొచ్చామన్నారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా ఆర్ధిక పరిస్థితుల అధిగమించి పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చెయ్యడం జరిగిందని, రాబోయే రోజుల్లో మరిన్ని పనులకు శ్రీకారం చూడతామన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం , గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కి మరింతగా కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ,తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని నిరూపిస్తున్నామన్నారు. ఆర్థిక పరిస్థితి ని అధిగమించి సంక్షేమం తో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. మహిళలు అండగా నిలిచేందుకు దిశా చట్టాన్ని తీసుకుని రావడం జరిగిందని ఆమె తెలిపారు.

ఈ పర్యటనలో భాగంగా మంత్రులు మల్లిపూడి గ్రామంలో రూ.35 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయాన్ని, రూ.21.80 లక్షలతో నిర్మించిన అర్భికే ను ప్రారంభించారు. జుత్తిగ గ్రామంలో రూ.40 లక్షలతో చేపట్టిన ఇందిరమ్మ కాలనీ సిసి రోడ్డు, రూ.40 లక్షలతో చేపట్టిన మావుళ్ళమ్మ గుడి రోడ్డు, రూ.30 లక్షలతో చేపట్టిన శివాలయం రోడ్డు, రూ.15 లక్షలతో చేపట్టిన శెట్టిబలిజి రోడ్డు, రూ.15 లక్షలతో చేపట్టిన ఎస్సి కాలనీ రోడ్డు, రూ.25 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ పై అంతస్తు భవనం, నాడు నేడు కింద రూ.15 లక్షలతో చేపట్టిన స్కూల్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. జుత్తిక గ్రామంలో భారతరత్న డా.బాబా సాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే,బాబు జగజ్జివన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భట్ల మగుటూరు గ్రామంలో శ్రీరామస్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, తదుపరి రూ.17.20 లక్షలతో చేపట్టిన ఇందిరమ్మ కాలనీ సిసి రోడ్డు, రూ.30 లక్షలతో చేపట్టిన జక్కమ్మశెట్టివారి పాలెం రోడ్డు లను మంత్రులు ప్రారంభించారు..

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వై. దుర్గా కిశోర్, ఎంపిడిఓ ఆర్.విజయరాజ్, పంచాయతీ రాజ్ డీఈ ఆర్. రాంబాబు, వ్యవసాయ శాఖ ఎ డి ఏ రమేష్, స్థానిక గ్రామ సర్పంచ్ లు డి.మహాలక్ష్మి, తమనంపూడి వీర్రెడ్డి, బి.సుగుణమ్మ, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *