విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఫిర్యాదుదారులు సమస్యకు నగర పాలక సంస్థ పరిధిలో తగు విచారణ జరిపి, చట్ట పరిధిలో పరిష్కారం అందిస్తాస్తున్నామని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. సోమవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్, అధికారులతో కలిసి మేయర్ బాధితుల నుంచి ఆర్జీలను స్వీకరించారు. స్పందన కార్యక్రమములో అదనపు కమిషనర్ (జనరల్) – 2, ఇంజనీరింగ్ – 4, పట్టణ ప్రణాళిక -8, డిప్యూటీ కమీషనర్ (రెవిన్యూ) -1, పబ్లిక్ హెల్త్ – 3, యు.సి.డి విభాగం – 4 మొత్తం 22 అర్జీలు స్వీకరించిన్నట్లు వివరించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారద దేవి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతభాయి, ఎస్.ఇ. నరశింహ మూర్తి, సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, ఏ.డి.హెచ్. జె.జ్యోతి, ఎస్టేట్ ఆఫీస్ డా.ఏ.శ్రీధర్ తదితరులు ఉన్నారు.
సర్కిల్ కార్యాలయాలలో స్పందన…
సర్కిల్ – 1 కార్యాలయంలో – 2 అర్జీలు రెవిన్యూ -1, యు.సి.డి విభాగమునకు సంబందించి-1, సర్కిల్ – 2 కార్యాలయంలో – 2 అర్జీలు ఇంజనీరింగ్ -1, రెవిన్యూ విభాగమునకు సంబందించి-1, సర్కిల్ – 3 కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగమునకు సంబందించి-1, ఆయా కార్యాలయాలలోని జోనల్ మరియు అసిస్టెంట్ కమిషనర్ లకు అందించుట జరిగింది.
Prajavartha Online Telugu News