Breaking News

పూణేలో వీఎంసీ బృందం ప‌ర్య‌ట‌న…

-ఆధునిక టెక్నాలజీ వాహనాల పరిశీలన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, అభివృద్ది చ‌ర్య‌ల్లో భాగంగా నగరపాలక సంస్థ వై.సి.పి ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ అధ్వ‌ర్యంలో కార్పొరేటర్లు బొల్లా విజయకుమార్, బి.ఎస్.వి జానారెడ్డి, సి.హెచ్ రామమోహన రావు, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు లతో కూడిన బృంద సభ్యులు రెండు రోజుల పాటు పూణే నగరంలో పర్యటించనున్నారు. న‌గ‌రంలో KAM-AVIDA ENVIRO ENGINEERS PVT. LTD వారి ఆహ్వ‌నం మేర‌కు వీఎంసీ బృందం సోమవారం పూణేలో కంపెనీలోని ఆధునిక టెక్నాలజీ వాహనాల ప‌నితీరును అధ్య‌య‌నం చేశారు. యు.జి.డి డ్రెయిన్లు శుభ్రపరచుటకు అత్యాధునిక టెక్నాలజీ తో కలిగిన వాహనముల పని తీరు, ఆపరేట్ చేయు విధానము మొదలగు అంశాలను బృందం స‌భ్యులు పరిశీంచారు. 7వ తేదీ పూణేలో వీఎంసీ బృందం క్షేత్ర స్థాయిలో పర్యటించనున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపు

-భక్తితో పాటు బాధ్యతగా వినాయక చవితి జరుపుకుందాం. -వినాయక పందిళ్లకు ఉచిత విద్యుత్తుపై మంత్రి హర్షం అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *