Breaking News

పరిశ్రమలు – ప్రభుత్వం రెండూ కలిసి ముందుకు వెళ్ళాలి

-మన లక్ష్యం – ప్రపంచ స్థాయిలో Ease of Doing Business లో ముందువరుసలో నిలవడం : పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి డా.ఎన్ యువరాజ్
-రాష్ట్ర ప్రాధాన్యతలలో పారిశ్రామిక అభివృద్ధి అగ్రస్థానంలో ఉంది
-పెట్టుబడిదారుల సమస్యలను వేగంగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యం : జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పరిశ్రమలు, ప్రభుత్వం రెండూ కలిసి ముందుకు వెళితేనే ప్రపంచ స్థాయిలో Ease of Doing Business లో ముందువరుసలో ఉంటామని పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి డా.ఎన్ యువరాజ్ తెలిపారు. శనివారం ఉదయం తిరుపతి లోని కెన్సెస్ హోటల్ నందు ఏర్పాటు చేసిన సులభతర వాణిజ్య అవగాహన ప్రాంతీయ సదస్సు లో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ డా.ఎస్. డా.ఎస్. వెంకటేశ్వర్ హాజరవగా, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి డా.ఎన్ యువరాజ్ విర్చువల్ గా హాజరై పరిశ్రమ యజమానులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ..గ్లోబల్ స్థాయిలో భారత్ అనేది విస్తృతమైన అవకాశాలున్న దేశం అని ఆ అవకాశాలను వాడుకోవాలంటే ప్రస్తుత వ్యవస్థలో సరళీకరణ, ఆన్‌లైన్ సౌకర్యాలు, నమ్మకం ఆధారిత విధానం ఉండాలన్నారు. అప్పుడు మాత్రమే దేశం డబుల్ డిజిట్ గ్రోత్ సాధిస్తుందన్నారు. Ease of Doing Business అనే కాన్సెప్ట్ 1990 ల నుంచే మొదలైందని, 1991-92లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయని, అప్పటి నుంచి ఇది మరింత ప్రాధాన్యం సంతరించుకుందని అన్నారు. ఏ పెట్టుబడైనా (FDI గానీ, Domestic గానీ) సులభంగా జరిగేలా చేస్తేనే ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మన రాష్ట్రం ఈ విషయంలో ముందుందని,అందులో భాగంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో సిస్టమ్, మీ సేవా కేంద్రాలు, గ్యారెంటీ యాక్ట్ వంటి కార్యక్రమాలను ప్రారంభించి౦దన్నారు. కానీ ఇంకా మెరుగుదల అవసరం ఉందని తెలిపారు. భారత ప్రభుత్వం ఇటీవల 23 Priority Areas గుర్తించిందని, వీటిలో ఫైర్ అప్రూవల్స్, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్, లేఅవుట్ అప్రూవల్స్ వంటి అంశాలు ఉన్నాయని, వీటిపై రాష్ట్రాల పనితీరు ఆధారంగా ర్యాంకింగ్ చేస్తున్నారన్నారు. మన రాష్ట్రం ప్రస్తుతం మంచి స్థాయిలో ఉన్నా, టాప్‌లో లేదని, సింగపూర్, యూరప్ దేశాల స్థాయిలో మనం నిలబడాలంటే గ్లోబల్ బెంచ్‌మార్క్ తీసుకొని ముందుకు వెళ్ళాలని అన్నారు. పరిశ్రమలు నైతిక విలువలను పాటిస్తూ, నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా అనుసరించాలన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ పడాలంటే కేవలం ఉత్పత్తులు తయారు చేయడమే కాకుండా, వాటి నాణ్యతను కూడా నిలబెట్టుకోవాలని పరిశ్రమ యజమానులకు సూచించారు. ప్రభుత్వం పరిశ్రమలకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని అన్నారు. మీ ఆలోచనలు, ప్రతిపాదనలు, రంగాలవారీగా అవసరాలను స్పష్టంగా తెలియజేయాలన్నారు. మనం కలిసి పనిచేస్తే, ఆంధ్రప్రదేశ్ Ease of Doing Businessలో ముందువరుసలో నిలబడటమే కాకుండా, ప్రపంచానికి ఒక మోడల్‌గా నిలుస్తుందని తెలిపారు. చిన్న స్థాయి వ్యాపారాలు ఏ అనుమతి లేకుండానే వెంటనే ప్రారంభించేలా లిస్ట్ తయారు చేయాలని, ఉదాహరణకు, ట్రేడ్ లైసెన్స్ అవసరం లేని వ్యాపారాలు ఉంటే వాటిని గుర్తించాలన్నారు. పరిశ్రమల సంఘాలు (CII, SME, Federation of Industries etc.) ప్రభుత్వానికి స్పష్టమైన సూచనలు ఇవ్వాలన్నారు. 2025 నాటికి భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వచ్చే 10-15 ఏళ్లలో ప్రపంచంలో టాప్ 2 లోకి రావడానికి అవకాశముందన్నారు. MSMEs, ముఖ్యంగా సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలు క్వాలిటీ మైలురాళ్లకు చేరుకోవాలంటే ప్రభుత్వ సహాయం అవసరం ఉంటుందన్నారు. మీరు సెక్టార్ వారీగా అవసరాలను తెలపాలని ఉదాహరణకు CTP (Common Testing/Processing facilities) కోసం 20% లేదా 30% గ్రాంట్ కు మేము మద్దతు ఇస్తామన్నారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ .. రాష్ట్ర ప్రాధాన్యతలలో పారిశ్రామిక అభివృద్ధి అగ్రస్థానంలో ఉందని, పెట్టుబడిదారుల సమస్యలను వేగంగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. పరిశ్రమలకు సంబంధించిన ప్రతినిధుల సమస్యలు, అభ్యర్థనలు అన్నీ సేకరించి ఆన్‌లైన్‌లో ఉంచి, సమయపాలనతో పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు. గాజులమండ్యం ఐటీ పార్క్‌కు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు, ఏపీడీసీ ప్రతినిధులు హాజరై స్థానిక సమస్యలు ముఖ్యంగా రహదారి, వీధి దీపాలు వంటి అంశాలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.తిరుపతి జిల్లా స్థూల జిల్లా ఉత్పత్తిలో 45% పరిశ్రమల వల్లనే వస్తోందని, ప్రతీ వారం రెండు మూడు రోజులు పారిశ్రామిక రంగానికి కేటాయిస్తున్నానని అన్నారు. .ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశ్రమల సమస్యలు త్వరగా పరిష్కరించాలనే దిశగా మార్గనిర్దేశం చేస్తున్నారని, “Ease of Doing Business” నుండి “Speed of Doing Business” వైపు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. తిరుపతి జిల్లా పెట్టుబడుల కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నదని, శ్రీ సిటీ, నాయుడుపేట, కృష్ణపట్నం, స్మార్ట్ సిటీ, రౌతుమాల ఇండస్ట్రియల్ పార్క్ వంటి విభిన్న పారిశ్రామిక నమూనాలు ఇప్పటికే విజయవంతం అవుతున్నాయని అన్నారు. తిరుపతి–నాయుడుపేట జాతీయ రహదారి, గూడూరు–రేణిగుంట రైల్వే ట్రిప్లింగ్, కృష్ణపట్నం, పోర్టులు, తిరుపతి ఎయిర్‌పోర్ట్ లభ్యతతో ఈ ప్రాంతం తూర్పు తీరంలో పెట్టుబడులకు అత్యంత అనుకూలంగా ఉందని అన్నారు. రాబోయే 10–15 ఏళ్లలో ఈ త్రిభుజ ప్రాంతం (నెల్లూరు–తిరుపతి–చెన్నై) దేశంలోనే అగ్రశ్రేణి పారిశ్రామిక వృద్ధి ప్రాంతంగా అవతరించనుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏపీ ఐ ఐ సి జెడ్ ఎమ్ విజయ్ భరత్ రెడ్డి, పరిశ్రమల శాఖ డి డి మురళి, సంబంధిత లైన్ అధికారులు, పారిశ్రామికవేత్తలు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *