తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ ఈ రోజు తిరుపతి పుణ్యక్షేత్రానికి విచ్చేసిన మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్‌గూలామ్ ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. తరువాత డా. పసుపులేటి హరిప్రసాద్ తిరుపతి జైన్ దేవస్థానంలోని ఆధ్యాత్మిక గురువు సిద్ధగురువర్ సిద్ధేశ్వర బ్రహ్మర్షి గురుదేవులను కలసి ఆశీర్వాదం పొందారు. గురుదేవులు హరిప్రసాద్ కి ఆశీస్సులు అందించారు.
Prajavartha Online Telugu News