Breaking News

అక్టోబర్ 1 నుంచి అలిపిరి మార్గం ప్రారంభం…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు పెద్ద సంఖ్యలో అలిపిరి మెట్ల మార్గంలో నడుస్తూ కొండపైకి వెళుతుంటారు . నడుచుకుంటూ కొండ పైకి ఎక్కి తమ మొక్కులు తీర్చుకుంటారు భక్తులు కొండపైకి వెళ్ళడానికి రెండు మెట్లు మార్గాలు ఉన్నాయి.ఒకటి అలిపిరి మెట్లు మార్గం.మరొకటి శ్రీవారి మెట్టు మార్గం అయితే ఎక్కువమంది అలిపిరి మార్గం ద్వారానే కొండ ఎక్కుతుంటారు. అయితే మరమ్మతులు ఆధునీకరణ కోసం అలిపిరి మార్గాన్ని కొన్ని నెలల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు మూసివేశారు. దీంతో ప్రస్తుతం శ్రీవారి మెట్టు మార్గం ద్వారానే భక్తులు కొండపైకి నడుచుకుంటూ వెళ్తున్నారు.ఇప్పుడు అక్టోబర్ 1 నుంచి అలిపిరి నడక మార్గంలో భక్తులు అనుమతించినట్లు ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)ఈ నెల 13 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అగరబత్తీలు భక్తులకు అందు బాటులోకి వస్తాయని చెప్పింది.సప్తగిరి గుర్తుగా ఏడు రకాల అగరబత్తీలు తీసుకొస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. బ్రహ్మోత్సవాలు నుంచి శ్రీవారి క్యాలెండర్లు, డైరీలను అందుబాటులో ఉంటాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *