Breaking News

నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు నిర్మాణంపై సమీక్షా…

-పేదలకు శాశ్వత గృహ వసతి కల్పించే బృహత్తర లక్ష్యంతో ముందుకు వెళదాం…
-ఈ మహా యజ్ఞంలో అందరూ భాగస్వామ్యం కావాలి…
-జిల్లా కలెక్టర్ జె.నివాస్, నందిగామ ఎమ్మెల్యే డా. జగన్మోహన్ రావు

విజయవాడ/నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న ఇళ్ల కాలనీల్లో పునాది దశ పూర్తి చేసిన గృహ నిర్మాణ లబ్దిదారులకు 60 వేల రూపాయలు(33శాతం) తొలి విడతగా మంజూరు చేయడం జరుగుతుందని ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ జె.నివాస్ చెప్పారు.
మంగళవారం నందిగామ శ్రీకారం కళ్యాణ మండపంలో నందిగామ నియోజకవర్గంలో వైఎస్సార్ జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణల పగ్రతిపై పంచాయతీరాజ్, రెవెన్యూ, గృహనిర్మాణం, డ్వామా తదితర శాఖల అధికారులతో నందిగామ శాసనసభ్యులు డా, మొండితోక జగన్మోహన్ రావుతో కలిసి నియోజకవర్గ స్థాయిలో సమీక్ష సమావేశాన్ని జిల్లా కలెక్టర్ జె.నివాస్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ జె. నివాస్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ లబ్దిదారులకు అవసరమైన సదుపాయలను ప్రభుత్వం తరుపున కల్పిస్తున్న చర్యలను మరింత వేగవంతం చేసి లబ్దిదారులు ఇళ్లు నిర్మించుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు, కంచికచర్ల, నందిగామ, వీరుల్లపాడు మండలాల్లో 9,509 మందికి ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఇళ్ల నిర్మాణలకు ఇప్పటికే 1340 మెట్రిక్ టన్నుల సిమెంటు, 398 మెట్రిక్ టన్నుల ఇనుము, 8,270 మెట్రిక్ టన్నుల ఇసుకను సిద్ధం చేశామన్నారు. ఇప్పటికే 997 మెట్రిక్ టన్నుల సిమెంటు, 156 మెట్రిక్ టన్నుల ఇనుము అందజేయడం జరిగిందన్నారు. ఇళ్ల నిర్మాణలకు ప్రభుత్వం మంజూరు చేసే రూ. 1.80 లక్షల్లో పునాది దశ పూర్తి చేసిన గృహనిర్మాణ లబ్దిదారులకు 60 వేల రూపాయలు (33 శాతం) మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అలాగే బ్యాంకుల ద్వారా జిల్లాలోని 25 వేల లబ్దిదారులకు రూ.50 వేల చొప్పున అదనపు రుణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే మరో 50 వేల రూపాయలు మంజూరు చేయడానికి బ్యాంకులు సిద్ధంగా ఉ న్నాయన్నారు. నందిగామ నియోజకవర్గంలో స్వయం సహాయక గ్రూపులకు చెందిన 7వేల 270 మంది గృహ నిర్మాణ లబ్దిదారులు ఉన్నారన్నారు. ఇప్పటికే 766 మంది రుణాలు పొందరన్నారు. గ్రామాలలో గృహ నిర్మాణ లబ్దిదారులు బృందాలుగా ఏర్పాడితే, సిమెంట్, ఇనుము, ఇసుక తదితర నిర్మాణ సామాగ్రి సమకూర్చుకోవాడానిక చక్కని వెసులుబాటు ఏర్పాడుతుందని తద్వారా గృహ నిర్మాణ పనులు వేగవంతం అవుతాయన్నారు. పదేసి గృహాలు చొప్పున నిర్మించేలా కాంట్రాక్టర్లకు అప్పచెప్పాలని ఆయన సూచించారు. ఇంటి నిర్మాణాలు సక్రమంగా పూర్తి కాబడిన తరువాత సంబంధిత కాంట్రాక్టర్ అకౌంట్‌కు నేరుగా ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. జగనన్న కాలనీలే ఔట్లలో స్థలాలను మెరక చేయడం, రవాదారుల నిర్మాణం, నీటి వసతి తదితర పనులన్ని నిర్మాణాలకు ముందే చేపట్టామని కలెక్టర్ జె. నివాస్ చెప్పారు.
నందిగామ శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్‌రావు మాట్లాడుతూ ప్రతి పేదవాడికి శాశ్వత ఇళ్లు వుండలన్నదే ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి లక్ష్యమన్నారు. జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకుని సొంత ఇంటిలో లబ్దిదారులు సంతోషంగా జీవించాలన్నారు. నందిగామ నియోజకవర్గంలో జగనన్న కాలనీల్లో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎంతో విలువైన లేఅవుట్లలో పేదలకు ఇళ్లు మంజూరు చేయడమే కాకుండా లే అవుట్లలో అన్ని మౌలిక సదుపాయలను ప్రభుత్వమే కల్పిస్తోందన్నారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు ఎటువంటి జాప్యం లేకుండా ఇళ్లు నిర్మించుకోవాలన్నారు. ప్రభుత్వం అందించే సాయంతోపాటు ఎసెహెజ్ గ్రూపుల్లో ఉన్న ఇళ్ల లబ్దిదారులకు ప్రత్యేకంగా అదనంగా రుణసదుపాయం జిల్లా కలెక్టర్ జె.నివాస్ కల్పించారని దీనిని సద్వినియోగం చేసుకుని ఇళ్లు త్వరితగతిన పూర్తి చేసుకోవాలన్నారు. నియోజకవర్గంలోని చందర్లపాడు మండలంలో 2468, కంచికచర్లలో 3367, నందిగామ మండలంలో 1748, వీరుల్లపాడు మండలంలో 2126 మందికి ఇళ్లు మంజూరు చేశామన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల సర్పండ్లు, ఏపి ఫారెస్ట్ డెవలంమెంట్ కార్పొరేషన్ చైర్మన్ యం, అరుణకుమారి, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. కె. మాధవిలత, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నూపుర్ శ్రీనివాస అజయ్ కుమార్, జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) కె. మోహన కుమార్, విజయవాడ సబ్ కలెక్టర్ జి.ఎస్ఎస్ ప్రవీణ్ చంద్, మున్సిపల్ చైర్మన్ యం వరలక్ష్మి, టిడ్కో పిడి చిన్నోడు, హౌసింగ్ పిడి రామచంద్రన్, డ్వామ పిడి సూర్యనారాయణ నగర పంచాయతీ కమిషనర్ డా. జయరాం, నాలుగు మండలల తహాశీల్దార్లు, యంపిడివోలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *