రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
డీఎస్సీ–2025లో ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థుల విజయవాడ ప్రయాణ ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. విజయవాడ లో నిర్వహించే రాష్ట్ర స్థాయి కార్యక్రమం లో పాల్గొనే అభ్యర్థుల కోసం నగరంలో ఆరు స్కూల్ లో ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగిందనీ తెలిపారు. కార్యక్రమానికి హాజరుకావడానికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులు ఒక సహాయకుడు/సహాయకురాలతో కలసి 24.09.2025 సాయంత్రం 4.00 గంటలకు రాజమహేంద్రవరం నందు వారికి కేటాయించిన పాఠశాలల వద్ద రిజిస్ట్రేషన్ నిమిత్తం హాజరుకావాలని కోరారు. జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కే.వాసుదేవరావు వివరాలు తెలియ చేస్తూ సంచాలకులు, పాఠశాల విద్య, ఆంధ్రప్రదేశ్ అమరావతి వారి ఆధ్వర్యంలో మెగా డీఎస్సీ–2025 నియామక పత్రముల జారీ కార్యక్రమం 25.09.2025న ముఖ్యమంత్రి సమక్షంలో విజయవాడలో జరగనున్నదన్నారు. ఇందు కోసం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్ ఏర్పాట్లు చెయ్యడం జరిగిందనీ తెలిపారు. ఈ రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థులు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, ఆధార్ కార్డు, కాల్ లెటర్, దుప్పటి, తలగడ మరియు గొడుగు తీసుకురావాల్సిందిగా తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు మరియు ఒక సహాయకుడి/సహాయకురాలికి వసతి, రాత్రి భోజనం, ఉదయం అల్పాహారం, అలాగే విజయవాడ ప్రయాణం కోసం బస్సు సౌకర్యం కల్పించబడినట్టు డీఈఓ వివరించారు.
రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో డీఎస్సీ అభ్యర్థుల వసతి సౌకర్యాలు
1. బి.వి.ఎం. ఉన్నత పాఠశాల, శ్రీరామనగర్, రాజమహేంద్రవరం పురుషుల కోసం: 900 సీట్లు — 19 గదులు
2. శ్రీ చైతన్య ఉన్నత పాఠశాల, మోరంపూడి, రాజమహేంద్రవరం అర్బన్ జెంట్స్ & లేడీస్ కలిపి: 300 సీట్లు — 6 గదులు
3. మున్సిపల్ ఉన్నత పాఠశాల, లాలా చెరువు, రాజమహేంద్రవరం అర్బన్ మహిళల కోసం: 400 సీట్లు — 9 గదులు
4. శ్రీ సత్యసాయి గురుకులం ఇంగ్లీష్ మీడియం పాఠశాల, రాజమహేంద్రవరం మహిళల కోసం: 400 సీట్లు — 10 గదులు
5. సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల, బాలాజిపేట, శంభునగర్ ఫ్లైఓవర్ కింద, రాజమహేంద్రవరం అర్బన్ లో.మహిళల కోసం: 600 సీట్లు — 14 గదులు
6.డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల, ప్రభుత్వ డైట్ కళాశాల దగ్గర, బొమ్మూరు లో మహిళల కోసం: 715 సీట్లు — 14 గదులు
Prajavartha Online Telugu News