మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వస్తుసేవల పన్ను తగ్గింపు జిఎస్టి 2.0 ధరలతో పేద, మధ్య తరగతి వర్గాలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలను కోరారు.
సోమవారం మధ్యాహ్నం ఆయన కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, బందరు ఆర్డిఓ కే స్వాతి, గ్రామ వార్డు సచివాలయాల జిల్లా అధికారి జడ్పీ డిప్యూటీ సీఈవో డాక్టర్ ఆనంద్ కుమార్, గ్రామ వార్డు సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్ రవికాంత్ తో కలిసి నిత్యవసర సరుకులకు సంబంధించిన సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అవగాహన గోడ పత్రిక ఆవిష్కరించారు.
కిరాణా సామాగ్రి, రోజువారీ నిత్యవసరాలు, ఆరోగ్యం జీవిత బీమా, దుస్తులు పాదరక్షలు, ఔషధాలు, స్టేషనరీ తదితర వస్తువులు తగ్గించిన జిఎస్టి ధరలతో తక్కువ ధరకే లభిస్తాయని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని కలెక్టర్ కోరారు.
Prajavartha Online Telugu News