మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కలెక్టరేట్ ప్రాంగణంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీఎస్టీ 2.0 సంస్కరణల ద్విచక్ర వాహన అవగాహన ర్యాలీని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తో కలిసి ప్రారంభించారు. ద్విచక్ర వాహన కొనుగోలుదారులకు కేంద్ర ప్రభుత్వం సూపర్ జీఎస్టీతో సూపర్ సేవింగ్స్ ను అందిస్తోందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి ఎన్ యు ఎన్ ఎస్ శ్రీనివాస్, కమర్షియల్ టాక్స్ డిప్యూటీ కమిషనర్ రాంబాబు, అసిస్టెంట్ కమిషనర్ సౌమ్య, డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ రమణకుమారి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News