మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర మాల సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ శనివారం కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో అధికారికంగా పర్యటించారు. వారు నగరంలోని రహదారులు భవనాల అతిథి గృహంలో షెడ్యూల్డ్ కులాల సంఘాల నాయకులు, లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడారు. ఎస్.సి. కార్యాచరణ ప్రణాళిక తదితర అంశాలపై ఏమైనా సమస్యలు ఉన్నాయా అని విచారించారు. అనంతరం కలెక్టరేట్లోని ఎస్.సి. సేవా సహకార సంస్థ కార్యాలయాన్ని సందర్శించి సంస్థ సిబ్బందితో సమావేశమై జిల్లాలో నడుస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు, ఎన్ ఎస్ ఎఫ్ డి సి, ఎన్ ఎస్ కె ఎఫ్ డి సి వసూళ్లు, వాణిజ్య సముదాయాలు, భూమి కొనుగోలు పథకం తదితర పథకాల కార్యకలాపాలు, పురోగతిపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ వెంట మాల సంక్షేమ సంస్థ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఎస్సీ కార్పొరేషన్ ఈవో సెల్వి, వారి కార్యాలయ సిబ్బండి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News