Breaking News

ఈ నెల 07 నుండి 09 వరకు తిరుపతి నందు జాతీయ సహకార సమావేశం నిర్వహణ

-వర్క్ షాప్ కు సంబందించిన ఏర్పాట్లన్నీ పకడ్బందీగా చేపట్టాలి
-లైజన్ అధికారులు వారికి కేటాయించబడిన విధులు సమర్థవంతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 07 నుండి 09 వరకు తిరుపతిలోని తాజ్ హోటల్ వేదికగా జాతీయ సహకార మంత్రిత్వ శాఖ వర్క్ షాప్ నిర్వహణ జరగనున్నదని, ఏర్పాట్లన్నీ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ సంబందిత అధికారులను ఆదేశించారు. శనివారం మద్యాహ్నం స్థానిక కలెక్టర్ కార్యాలయం మినీ కాన్ఫరెన్స్ హాల్ నుండి తిరుపతి నందు జరగనున్న జాతీయ సహకార మంత్రిత్వ శాఖ వారు నిర్వహిస్తున్న వర్క్ షాప్ పై జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డి.ఆర్.ఓ నరసింహులు, జిల్లా కో-ఆపరేటివ్ అధికారిణి శ్రీమతి లక్ష్మి లతో కలసి విధులు కేటాయించబడిన కమిటీలు, లైజన్ అధికారులతో జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ జూమ్ కాన్ఫెరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేసారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… తిరుపతిలోని తాజ్ హోటల్ వేదికగా ఈ నెల 07 నుండి 09 వరకు జాతీయ సహకార మంత్రిత్వ శాఖ వర్క్ షాప్ నిర్వహణ జరగనున్నదని ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సంబందిత అధికారులను ఆదేశించారు. సహకార రంగాన్ని బలోపేతం చేయడానికి సహకార మంత్రిత్వ శాఖ తీసుకున్న వివిధ కార్యక్రమాల అమలు పై సమీక్షించడానికి త్రైమాసిక సమావేశం జరగనుందని, ఈ సమీక్ష సమావేశానికి జాతీయ సహకార మంత్రిత్వశాఖ సెక్రటరీ ఆశిష్ కుమార్ భుటాని IAS , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ IAS, జాయింట్ సెక్రటరీ సిద్ధార్థ్ జైన్ IAS, ఆంధ్ర రాష్ట్రా IAS లు స్పెషల్ చీఫ్ సెక్రటరీ అగ్రికల్చర్ అండ్ సెరికల్చర్ కోఆపరేషన్ and మార్కెటింగ్ బి.రాజశేఖర్ IAS, సహకార కమిషనర్ ఏ.బాబు IAS , సహకార శాఖ కార్యదర్శులు మరియు సహకార సంఘాల రిజిస్ట్రార్ లతో సహా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి సహకార శాఖ సీనియర్ అధికారులు, కీలకమైన జాతీయ స్థాయి సహకార సంస్థల ప్రతినిధులు మరియు సహకార శాఖ (గవర్నమెంట్ ఆఫ్ ఇండియా) అధికారులు హాజరవుతారన్నారు.

కావున తాజ్ హోటల్ హాల్ నందు జరుగు ఈ కార్యక్రమానికి అవసరమైన సీటింగ్, స్టేజ్, ఏర్పాట్లు క్రమ పద్దతిగా ఉండాలని, లైజన్ అధికారులు ఎయిర్పోర్ట్ నుండి అతిథులను స్వాగతించి వారు బస చేయు ప్రదేశాలకు జాగ్రత్తగా చేరుకునేలా చూడాలన్నారు. పోలీసు శాఖ వారు తాజ్ హోటల్ వద్ద బందోబస్త్ ఏర్పాట్లు చూసుకోవాలన్నారు. అతిథులకు తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి దర్శనాలకు ఏర్పాట్లను సంబంధిత అధికారులు చూసుకోవాలన్నారు. అలాగే బస చేయు హోటళ్ల వద్ద మెడికల్ క్యాంప్ లను ఏర్పాటు చేసి , అంబులెన్స్ లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. విధులు కేటాయించిన లైజన్ అధికారులు వారి విధులను ఎలాంటి లోటు పాట్లు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ వర్క్ షాప్ పై తిరుపతి జిల్లా యంత్రాంగం సమన్వయంతో కృషి చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలన్నారు.

ఈ జూమ్ కాన్ఫెరెన్స్ లో ఆంధ్ర ప్రదేశ్ కో- ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఎం.డి శ్రీనాథ్ రెడ్డి, అడిషనల్ ఎస్.పి రవి మనోహరాచారి, ఆర్.డి.ఓ లు తిరుపతి, కాళహస్తి రామ్మోహన్, భాను ప్రకాష్ రెడ్డి, డి.డి సోషల్ వెల్ఫేర్ విక్రమ్ కుమార్ రెడ్డి, ఏ.పి.ఎస్.పి.డి.సి.ఎల్ అధికారులు, డి.పి.ఓ, డి.ఎస్.ఓ,టూరిజం ఆర్.డి, తహసీల్దార్ లు, సంబందిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *