Breaking News

రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి…

-ప్రణాళికాబద్దంగా అడుగులు వేస్తూ రాష్ట్రాభివృద్దికి పాటుపడుతున్న కూటమి ప్రభుత్వం.
-”ఆటో డ్రైవర్ సేవలో”తిరుపతి జిల్లా వ్యాప్తంగా 14,375 మంది ఆటో రిక్షా, మోటార్ క్యాబ్ మరియు మ్యాక్స్ క్యాబ్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వాహన యజమానులకు రూ.21.56 కోట్లలబ్ది.
-రాష్ట్రవ్యాప్తంగా 2,90,699 లక్షలమంది లబ్దిదారుల ఖాతాలో రూ.436 కోట్ల రూపాయలు జమ
తిరుపతి నియోజకవర్గంలో 2307 మంది లబ్దిదారుల ఖాతాలో రూ. 3.46 కోట్ల జమ
-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్ శాఖామాత్యులు మరియు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్ శాఖామాత్యులు మరియు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక కచ్ఛపి ఆడిటోరియం నందు నిర్వహించిన ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వయం శక్తితో ఎదిగే శ్రమజీవికి ప్రభుత్వం చేయూతను అందించాలన్న ఉద్దేశంతో ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారన్నారు. తిరుపతి జిల్లాలో గల 7 అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రాలలో ఆయా శాసన సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నారన్నారు. జిల్లా ఇంచార్జి మంత్రిగా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సూచించారన్నారు.

ఈ పథకం ద్వారా జిల్లాలో అర్హులైన 14,375 మంది ఆటో రిక్షా, మోటార్ క్యాబ్ మరియు మ్యాక్స్ క్యాబ్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వాహన యజమానులకు ఒక్కొక్కరికి రూ.15000/- చొప్పున 21,56,25,000/- రూపాయల ఆర్ధిక సహాయాన్ని నేడు వారి ఖాతాలలో జమ చేశామన్నారు. ఆటో డ్రైవర్ సేవలో పథకంతో చంద్రబాబు ప్రభుత్వం కార్మికుల పక్షపాతి అని మరోసారి రుజువైందన్నారు. ఈ పథకం ద్వారా తమ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2,90,669 మంది డ్రైవర్లకు 436 కోట్ల రూపాయలు అందించామన్నారు. గత వైసిపి ప్రభుత్వం వాహన మిత్ర పేరుతో రూ. పదివేలు మాత్రమే ఇవ్వగా తమ ప్రభుత్వం 15000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తోందన్నారు. జగన్ ప్రభుత్వం 260 కోట్ల రూపాయలు ఈ పథకం కోసం ఖర్చు చేస్తే తమ ప్రభుత్వం 436 కోట్ల రూపాయలు ఇస్తోందని తెలిపారు.
జగన్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఒక చేత్తో రూ పదివేలు ఇస్తూనే ఫైన్ ల ద్వారా 20,000 రూపాయలు దోపిడీ చేసిందన్నారు. అంతే కాకుండా పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతంగా పెంచి జగన్ ప్రభుత్వం ఒక్కో ఆటో డ్రైవర్ పై ఏడాదికి 36 వేల రూపాయల భారం మోపిందన్నారు. జగన్ ప్రభుత్వంలో ట్రాఫిక్ పోలీసులు ఆటో డ్రైవర్ల పై విపరీతంగా చలాన్లు రాసి వేధించడమే కాకుండా రోడ్డు టాక్స్ లు భారీగా పెంచి ఆటో డ్రైవర్ల రక్తాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం జలగలా పీల్చేశారన్నారు. కానీ తమ కూటమి ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు ఎలాంటి వేధింపులు లేవని, రోడ్ టాక్స్ లు, గ్రీన్ టాక్స్ లు లేవని, కార్మికుల, కర్షకుల పక్షపాత ప్రభుత్వంగా నేడు రాష్ట్రంలో సుపరిపాలన సాగిస్తోందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల్లోనే 16 పథకాలను అమలు చేస్తున్నామన్నారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే పెన్షన్ల పెంపు, డీఎస్సీప్రకటన, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ తదితర పథకాలపై తొలి సంతకం చేశారన్నారు. సుపరిపాలనలో తొలిఅడుగులో భాగంగా ప్రతిగడపకు వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాల అమలు గురించి తెలిపి, వారి నుండి సలహాలు, సూచనలు స్వీకరించామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆటోడ్రైవర్ సేవలో పథకం వర్తింపచేస్తామన్నారు. 2014 సంవత్సరంలో నాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లైఫ్ టాక్స్ ఎత్తివేసి ఆటోడ్రైవర్ లకు మేలు చేసిందన్నారు. ఆగస్టు15 న ప్రారంభించిన స్త్రీ శక్తి పథకం ద్వారా ఏడు కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని తద్వారా 300 కోట్ల రూపాయల లబ్ది వారికి కల్పించామన్నారు. 2019 లో వచ్చిన జగన్ ప్రభుత్వం టిడిపి ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నింటినీ ఆపివేయడమే కాకుండా పెట్టుబడి దారులను రాష్ట్రంనుండి తరిమికొట్టారని విమర్శించారు. అనంతరం వచ్చిన కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులను రాష్ట్రానికి ఆహ్వానించి అనేక పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందని తెలిపారు. అద్భుతమైన రాజధానిగా అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను గమనించి ప్రజలందరు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. మ్యానిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినప్పటికీ ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.15,000/- చొప్పున అందిస్తున్నామన్నారు. తల్లికి వందనం కార్యక్రమం ద్వారా నిరుపేద కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఈ పథకాన్ని వర్తింపచేస్తున్నామన్నారు. పేదవారికి అండగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతరం పనిచేస్తున్నారన్నారు. తిరుపతిలో 11 కొత్త హోటళ్ళు ప్రారంభం కానుందని తద్వారా ఆటో రిక్షా, మోటార్ క్యాబ్ మరియు మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లకు మరింత లబ్ది కలగనుందన్నారు. ఈ సందర్బంగా అటో డ్రైవర్ సేవలో పథకం క్రింద తిరుపతి జిల్లా వ్యాప్తంగా 14,375 మంది ఆటో రిక్షా, మోటార్ క్యాబ్ మరియు మ్యాక్స్ క్యాబ్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వాహన యజమానులకు రూ.21.56 కోట్ల మెగా చెక్కును మంత్రి లబ్దిదారులకు అందించారు.

ఈ సందర్బంగా ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమానికి అద్యక్షత వహించిన స్థానిక ఎంఎల్ఏ ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ గౌ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కళ్యాణ్, యువనాయకులు నారా లోకేష్ లు రాష్ట్రాభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. అన్ని రంగాలలో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో వారు నడుపుతున్నారని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తోందన్నారు. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు కల్పించామన్నారు. తద్వారా ఆటో డ్రైవర్లకు ఎదురౌతున్న ఇబ్బందులను కూటమి ప్రభుత్వం గమనించి ఎన్నికల్లో హామీ ఇవ్వనప్పటికీ ఇతోదికంగా ఆర్ధిక సహాయం అందించాలని నిర్ణయించి ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకం ద్వారా తిరుపతి జిల్లాలో 2307 మంది లబ్దిదారుల ఖాతాలో 3,46,05,000 రూపాయలు జమ చేశామన్నారు. ఇంకా ఎవరైనా అర్హులై ఈ పథకం అందనివారికి కూడా లబ్ది కలిగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అమరావతిని అన్ని హంగులతో రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తి చేస్తున్నారని, అలాగే 2027 నాటికి పోలవరాన్ని కూడా పూర్తి చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి తెలిపారన్నారు. ఆటో డ్రైవర్లకు ఏదైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని తీర్చడానికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం “ఆటో డ్రైవర్ సేవలో” కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేడు ఘనంగా ప్రారంభించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,90,000 ఆటో డ్రైవర్ల కుటుంబాలకు, ప్రతి ఏడాది రూ.₹15,000/- చొప్పున ఆర్థిక సహాయం అందించబడుతుందన్నారు. అందులో భాగంగా తిరుపతి జిల్లాలో 14,375 మంది లబ్ధిదారులకు గాను ₹21.56 కోట్ల రూపాయలు నేడు నేరుగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ, సంక్షేమం విషయంలో ఎవరికీ ఇబ్బంది కలగకూడదన్న సంకల్పంతో ఈ పథకం అమలులోకి తెచ్చారన్నారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం “సూపర్ సిక్స్” పథకాల కింద డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగ నియామక పత్రాలు అందించిందన్నారు.ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అత్యధికంగా ₹4,000 నుండి ₹15,000 వరకు పెన్షన్ అందిస్తోందన్నారు. దీపం పథకం కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వం అందిస్తోందని, స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిందన్నారు. రైతుల కోసం “అన్నదాత సుఖీభవ” పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ₹రూ.6,000/-కు రాష్ట్రం అదనంగా ₹రూ.14,000/- జోడించి ఏ రాష్ట్రంలో లేని విధంగా సంవత్సరానికి రూ.₹20,000/- అందిస్తోందన్నారు. “తల్లికి వందనం”పథకం కింద ప్రతి విద్యార్థికి ₹రూ.13,000/- చొప్పున తల్లుల ఖాతాలలో జమ చేస్తున్నారన్నారు. నేడు ఆటో డ్రైవర్ల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధతో, డ్రైవర్ల కుటుంబాలు భద్రతగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త చరిత్ర సృష్టించిందని, అభివృద్ధి – సంక్షేమం రెండింటినీ సమతూకంగా కొనసాగిస్తామని గౌరవ ముఖ్యమంత్రి స్పష్టం చేశారన్నారు.

ఈ సందర్బంగా ఆటో డ్రైవర్లకు పలు సూచనలు ఇస్తూ, మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ట్రాఫిక్ నియమాలను పాటించడం, పర్యాటకులను గౌరవంగా స్వాగతించడం మరియు జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను పరిచయం చేయడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. జిల్లాలో రోజకు లక్షన్నర మంది వరకు పర్యాటకులు వచ్చిపోతుంటారని, దీనివల్ల ఆటో డ్రైవర్లు ఎక్కువసేపు పని చేయవలసి వస్తుందని, అయితే రాత్రివేళల్లో ఎక్కువగా పని చేయడం, అతిగా శ్రమించడం వల్ల బీపీ, షుగర్, ఊబకాయం వంటి సమస్యలు పెరుగుతున్నాయని అన్నారు. ఆరోగ్యం దెబ్బతింటే కుటుంబానికి ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి డ్రైవర్లు సమతుల్యంగా పని చేయాలని, పని మరియు ఆరోగ్యం మధ్య సమతుల్యతను పాటించాలని సూచించారు. ఆటోల్లో నిబంధనలకు మించి ప్రయాణికులను ఎక్కించడం (ఓవర్ క్రౌడింగ్) పూర్తిగా మానుకోవాలని తెలిపారు. ఒకే ఆటోలో అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించడం ప్రమాదకరమని, అదేవిధంగా, ఓవర్ స్పీడింగ్ చేయకూడదని, రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ట్రాఫిక్ నియమాలు కచ్చితంగా పాటించాలన్నారు. తిరుపతి నగరం ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రం అయినందున ఇక్కడ డ్రైవర్ల ప్రవర్తన, ట్రాఫిక్ నిబంధనల అనుసరణ వలన నగరంపై పర్యాటకులకు మంచి అభిప్రాయం ఏర్పడుతుందన్నారు. పర్యాటకులకు తిరుమలతో పాటు శ్రీకాళహస్తి, జిల్లా పరిధిలోని కాణిపాకం వంటి ఇతర ఆలయాలు, జలపాతాలు, సుందర ప్రదేశాలు గురించి తెలియజేయాలని సూచించారు. డ్రైవర్లు స్వయంగా మార్గదర్శకులుగా వ్యవహరించి పర్యాటకులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తే, వారు జిల్లాలో కనీసం రెండు రోజుల పాటు ఉండే అవకాశం ఉంటుందని. దీని వలన జిల్లాకు ఆర్థిక లాభం కలుగుతుందని తెలిపారు. తిరుపతిలో హోమ్ స్టేలు విస్తృతంగా అభివృద్ధి చెందాయని, ప్రస్తుతం 8,000 పైగా గదులు అందుబాటులో ఉన్నాయని, వీటిని కూడా డ్రైవర్లు పర్యాటకులకు పరిచయం చేస్తే స్థానిక ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందించిన వారౌతారన్నారు. ప్రభుత్వం ఇప్పటికే కొంతమంది ఆటో డ్రైవర్లకు ఎలక్ట్రిక్ ఆటోలు అందజేసిందని, వీటివలన ఇంధన ఖర్చులు తగ్గి, నెలకు సుమారు రూ.10,000/- నుండి రూ.12,000/- వరకు అదనపు ఆదాయం వస్తోందని వివరించారు. మిగతా ఆటో డ్రైవర్లు కూడా సాధ్యమైనంత వరకు ఎలక్ట్రిక్ వాహనాలు లేదా బయోఫ్యూయల్ వాహనాలకు మారితే మరింత లాభం పొందవచ్చని తెలిపారు. కార్యక్రమానికి హాజరైన ఆటో డ్రైవర్లందరికీ, వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ, “ఆరోగ్యకరమైన జీవితం – సురక్షిత ప్రయాణం – అభివృద్ధి చెందిన పర్యాటకం” లక్ష్యంగా అందరూ కలిసి ముందుకు సాగాలని సూచించారు.

రాష్ట్ర యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ ఎన్టిఆర్ చే స్థాపింపబడిన టిడిపి ఆవిర్భావం నుండే బడుగుబలహీన వర్గాల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అదే బాటలో నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి పయనిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. ఈ పథకం ఆటో డ్రైవర్ జీవితాలలో వెలుగులు నింపుతుందన్నారు.

గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ ఛైర్మన్ సుగుణమ్మ మాట్లాడుతూ పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం అన్ని నియోజకవర్గాలలో ప్రారంభమైందన్నారు. ప్రతి ఏడు రూ. 15,000/- చొప్పున ఆటో డ్రైవర్లకు అందివ్వడం జరుగుతోందన్నారు. సూపెర్ సిక్స్ హామీలు నేరవేర్చామని, జిఎస్టి 2.0 తో కలిగే లబ్దిని మరో సూపెర్ సిక్స్ గా ప్రజలు భావిస్తున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి ఫలితమే ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతోందన్నారు.
రాష్ట్ర హస్తకళలఅభివృద్ధి చైర్మన్ డా.పసుపు లేటి హరిప్రసాద్ మాట్లాడుతూ ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమం వైపు రాష్ట్రం పరుగులుపెడుతోందన్నారు. ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. అద్బుతమైన రాజధానిగా అమరావతిని రాష్ట్ర ముఖ్యమంత్రి తీర్చిదిద్దుతున్నారని, గిరిజనుల అభివృద్దికి ఉపముఖ్యమంత్రి తోడ్పాటును అందిస్తే పేదవారికి మంచి విద్యనూ అందించాలని నారాలోకేష్ కృషి చేస్తున్నారన్నారు. వారందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారాన్ని అందిస్తున్నారన్నారు.

రాష్ట్ర నాయీబ్రాహ్మణ చైర్మన్ రుద్ర కోటి సదాశివం మాట్లాడుతూ 16 నెలల కాలంలో అన్ని హామీలను ఈ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమం అభివృద్దిపై రాష్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు.

రాష్ట్ర ఎస్ సి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి కుమారి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలిరోజునే మెగా డిఎస్సీ పై తొలిసంతకం, తల్లికి వందనం, దీపం -2, పథకం అమలు, జిఎస్టీ తగ్గింపు తదితర పథకాల ద్వారా ఎన్డిఏ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు మేలు కలిగించిందన్నారు.

తిరుపతి మునిసిపాలిటీ డిప్యూటీ మేయర్ ఆర్.సి.మునికృష్ణ లు మాట్లాడుతూ గత పాలకులు రాష్ట్రాన్ని అదోగతిపాలు చేశారన్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కూటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కృషి చేస్తోందన్నారు.

రీజనల్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బి.కృష్ణవేణి మాట్లాడుతూ ప్రమాదాలు నిర్వారించాలని రోడ్డు బధ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతి వాహనం ఫిట్నెస్ కలిగి ఉండాలన్నారు. గత 15 రోజులుగా ఈ పథకానికి అర్హులను గుర్తించడం జరిగిందన్నారు. ఇంకా అర్హులు ఎవరైనా మిగిలిఉంటే వారికి కూడా ఈ పథకం వర్తింపచేస్తామన్నారు.

ఆటో డ్రైవర్ ఎ. జయకుమార్ తన స్పందనను తెలియజేస్తూ మంచి మనసుతో రాష్ట్ర ప్రభుత్వం రూ.15,000/- ఆర్ధిక సహాయాన్ని అందించిందని ఇందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

మహిళా ఆటోడ్రైవర్ శ్రీమతి ఏ.లత తమ స్పందనను తెలియజేస్తూ తాను పదోతరగతి వరకు చదివానని, గృహిణిగా ఉంటూ డ్వాక్రా లో మూడున్నర లక్షల రూపాయాల ఋణంతో ఆటోను కొనుగోలు చేసి జీవిస్తున్నామన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా తన ఇద్దరి పిల్లలకు లబ్ది కలిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి అందించిన ఈ మొత్తాన్ని ఎన్ని కస్టాలు ఎదురైనా పిల్లల చదువుకోసమే ఖర్చుచేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో చైతన్య కళాశాలలో చదువుతున్నారన్నారు. గత తెలుగుగేశం ప్రభుత్వ హయాంలో తనకు కుట్టు మిషన్ ను అందించారని, ప్రస్తుతం రూ.15,000/- ఆర్ధిక సహాయం అందిస్తున్న ఈ ప్రభుత్వం కలకాలం పాలన సాగించాలని ప్రార్థిస్తున్నానన్నారు.మరో ఆటో డ్రైవర్ ఖాదర్ బాష మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఈ పథకం తమ ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఎంతో మేలు చేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో తిరుపతి నగరపాలక సంస్థ కమీషనర్ మౌర్య, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్సీ, ఆర్టిఓ మురళీమోహన్, ఎంవిఐ లు వివి సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, అతిక, ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్లు ఎం. ప్రసాద్ వర్మ, మోహన్ కుమార్, ఆంజనేయ ప్రసాద్, రమణ నాయక్, వాహన యూనియన్ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆటో డ్రైవర్లు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *