మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అతవాలే ఆదివారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకోగా గుడివాడ రెవెన్యూ డివిజనల్ అధికారి జి బాలసుబ్రమణ్యం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర మంత్రిని రాష్ట్ర ప్రభుత్వ విప్, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు కేంద్ర మంత్రిని విమానాశ్రయం విశ్రాంతి గదిలో మర్యాదపూర్వకంగా కలిసారు. అలాగే సాంఘిక సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ జే రంగ లక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా ఉపసంచాలకులు ఎం రమాదేవి, మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసారు. ఈ కార్యక్రమంలో విమానాశ్రయం సిఎస్ఓ ధర్మేంద్ర ప్రోటోకాల్ అధికారి తులసి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News