-దావులూరు గ్రామంలో స్వమిత్వ సర్వే పరిశీలించిన జిల్లా కలెక్టర్
దావులూరు(కంకిపాడు), నేటి పత్రిక ప్రజావార్త :
ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా స్వమిత్వ సర్వే పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కంకిపాడు మండలం దావులూరు గ్రామంలో స్వమిత్వ సర్వేను పరిశీలించారు. తొలుత ఆయన గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి స్వమిత్వ సర్వేకు సంబంధించిన రిజిస్టర్లు, మ్యాపులను పరిశీలించారు. అనంతరం ఆయన రెవెన్యూ అధికారులు, సర్వేయర్లతో కలిసి గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. గృహాల వద్దకు వెళ్లి చేసిన సర్వేను రికార్డులతో సరిపోలుస్తూ పరిశీలించారు. కొంతమంది గ్రామస్తులతో మాట్లాడి సర్వే చేస్తున్న విధానంపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సర్వేకు ముందు సంబంధిత భూ యజమానికి నోటీసుల ద్వారా తప్పనిసరిగా తెలియజేయాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు.
ఉయ్యూరు ఆర్డీవో బీఎస్ హేలా షారోన్, సర్వే ఏడి జోషిలా, కంకిపాడు తాసిల్దార్ భవన్నారాయణ, ఎంపీడీవో అనూష, సర్వేయర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
Prajavartha Online Telugu News