Breaking News

ఆక్వా సాగు వైపు దృష్టి సారించేలా రైతులను ప్రోత్సహించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో సాంకేతిక పరిజ్ఞానంతో ఆక్వా సాగు వైపు దృష్టి సారించేలా రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో ఆక్వా ఎక్స్చేంజ్ –వినూత్న పద్ధతులలో ఆక్వా సాగుపై సంబంధిత అధికారులు, అభ్యుదయ రైతులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాంకేతిక పద్ధతులను అవలంబించి వినూత్న తరహాలో ఆక్వా సాగు చేయడం వలన రైతులకు ఎంతో లాభదాయకమన్నారు. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సాగు చేసేందుకు ప్రభుత్వం తరఫున అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తామన్నారు. తొలిదశలో పైలట్ ప్రాజెక్టు కింద ప్రయోగాత్మకంగా నందివాడ మండలం ఒక క్లస్టర్ గా తీసుకొని అందులోని 6 గ్రామాల పరిధిలో ఉన్న 300 మంది రైతులకు ఆక్వా సాగులో సాంకేతిక పరిజ్ఞానం జోడించే అంశంపై పూర్తి అవగాహన కలిగించాలన్నారు.

ఆక్వా ఎక్స్చేంజ్ లిమిటెడ్ సహా వ్యవస్థాపకులు కిరణ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్కు వివరిస్తూ 2020 సంవత్సరంలో సాంకేతిక పరిజ్ఞానంతో ఆక్వా సాగు చేయడం మొదలుపెట్టామన్నారు. అంచనంచెలుగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఆక్వా సాగుకు అవసరమైన పరికరాలను రూపొందించామన్నారు.
ప్రస్తుతం 5 వేల మందికి పైగా రైతులు 67 వేల ఎకరాలలో ఈ విధానాలను అనుసరిస్తున్నారన్నారు. మొత్తం 20 శాతం మంది రైతులు ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారన్నారు.
ఒక ఎకరా నుండి ఎన్ని ఎకరాల కుంటలు అయినా కావచ్చు అందులో 6 నెలల వరకు 12 వేల రూపాయల వ్యయంతో సాంకేతిక పరిజ్ఞాన పరికరాలను అందిస్తామన్నారు.
ఆసక్తిగల రైతులు ముందుకు వస్తే వారికి బ్యాంకు ద్వారా కూడా రుణాలు అందేలాగా కృషి చేస్తామన్నారు. ఇప్పటికే తాము ఐడిఎఫ్సి, ఏపీజీబీ వంటి బ్యాంకులతో అనుసంధానమై ఉన్నామన్నారు.
సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ ఖర్చులను తగ్గించుకోవడమే నూతన ఆక్వా సాగు లక్ష్యం అన్నారు.
ఈ సాగు ద్వారా విద్యుత్తును, రొయ్యల ఆరోగ్యము, వాటికి వేసే ఆహారము పకడ్బందీగా పర్యవేక్షించవచ్చున్నారు.
విద్యుత్ 30 శాతం ఆదా అవుతుందని, సాగు కూలి ఖర్చులు తగ్గిపోతాయనీ, సమయం వృధా కాకుండా ఉంటుందన్నారు.

ఈ సాంకేతిక పద్ధతుల్లో ఈ, మడగాస్కర్ తదితర దేశాల్లో ఇప్పటికే ఆక్వా సాగు చేస్తున్నారన్నారు.
బీమా సౌకర్యం కోసం ఓరియంటల్, వ్యవసాయ టాటా ఏఐజి తో కూడా అనుసంధానమై ఉన్నామన్నారు

ఈ సమావేశంలో మత్స్యశాఖ జేడీ అయ్యా నాగరాజా, అభ్యుదయ రైతు ఆక్వా ఎక్స్చేంజ్ ప్రాజెక్టు అధినేత కుమార్ రాజు,మత్స్య శాఖ ఏడి సిహెచ్ రమేష్, ఎఫ్ డి ఓ సెలేహ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *