Breaking News

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అమరావతి రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై కలెక్టర్లతో మాట్లాడారు.

ప్రధానంగా, ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన పురోగతి, గ్రామ వార్డు సచివాలయాల విభాగం 3 అంచెల నిర్మాణం, సీజనల్ వ్యాధులు, మందుల పంపిణీ, ఆసుపత్రులలో పారిశుధ్యం, ఆసుపత్రులలో రోగనిర్ధారణ సేవలు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఉపశమన మొత్తాల పంపిణీ, ఎస్సీ కార్పొరేషన్ కొనుగోలు చేసిన వాహనాల డిస్పోజ్, కొత్త స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ, రైస్ మిల్లుల ట్యాగింగ్ తనిఖీ, రైతు సేవా కేంద్రాలు తనిఖీ, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, సేవలపై సానుకూల ప్రజా దృక్పథం తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలెక్టర్లతో సమీక్షించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ నుంచి సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, డీఆర్వో కే చంద్రశేఖరరావు, కే ఆర్ ఆర్ సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, జెడ్పి సీఈవో కన్నమనాయుడు, డిప్యూటీ సీఈవో డాక్టర్ ఆనంద్ కుమార్, డిఎంహెచ్వో వెంకట్రావు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ టి శివరాం ప్రసాద్, జిల్లా పౌర సరఫరాల అధికారి జి మోహన్ రావు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు షేక్ షాహిద్ బాబు, మార్కెటింగ్ ఎడి నిత్యానంద్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *