Breaking News

ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో ఎంప్లాయిస్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించి పలువురు ఉద్యోగుల నుండి స్వయంగా అర్జీలు స్వీకరించారు. ఉద్యోగులు విన్నవించిన వివిధ సమస్యలను ఆయన ఓపిగ్గా ఆలకించి పరిష్కారంపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. శుక్రవారం నిర్వహించిన గ్రీవెన్స్ లో మొత్తం 5 దరఖాస్తులు రాగా, వాటిని సంబంధిత అధికారులకు పంపిస్తున్నామని వాటిని సకాలంలో పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *