Breaking News

ఆరోగ్యవంతమైన జీవనం కోసం ప్రతి ఒక్కరూ పెరట్లో మొక్కలు పెంచాలి…

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యవంతమైన జీవనం కోసం ప్రతి ఒక్కరూ పెరట్లో మొక్కలు పెంచాలని జిల్లా కలెక్టర్ సతీమణి పృథ్వి కళ్యాణి పిలుపునిచ్చారు. శనివారం ఉదయం నగరంలోని గాంధీనగర్ ఉదయపు నడక మిత్రమండలి భవనంలో ఏపీ యోగాసభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యోగా తరగతుల్లో జిల్లా కలెక్టర్ సతీమణి కుటుంబ సభ్యులతో కలిసి యోగాసనాలు, ప్రాణాయామాలు చేశారు. అనంతరం వారు యోగా సభ్యులతో కలిసి మంచినీటి సీసాలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతోపాటు వాటిని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం వలన స్వచ్ఛమైన గాలి లభించడం లేదన్నారు. మొక్కల పెంచడం వలన స్వచ్ఛమైన ఆక్సిజన్ ప్రతి ఒక్కరికి లభించి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో యోగా గురువులు రమేష్, వడ్డీ శ్రీనివాసు, సమాచార శాఖ వెంకటేశ్వర ప్రసాదు, అశోక్ మాస్టర్, ఆర్ డి ప్రసాద్, జగన్ , రేఖా, రాజకుమారి, సౌమ్య , కళ్యాణి తదితర యోగా సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *