మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థి దశలోనే పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచాలని పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ ఇన్చార్జి ప్రిన్సిపల్ శ్రీ జాలాది సత్యనారాయణ పేర్కొన్నారు. స్థానిక పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాలో ఐటీసీ, వావ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థుల నుంచి పాత పుస్తకాలు పేపర్లు సేకరణ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు పెంచడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు పిల్లలలో అవగాహన కల్పించడానికి ఐ టి సి, వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ (వావ్) వారి ఆధ్వర్యంలో ఇంటర్ స్కూల్ రీసైకిలింగ్ ఛాంపియన్షిప్ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అత్యధికంగా 26 కేజీల బరువు గల పాత పుస్తకాలను అందించిన ఒకటో తరగతి ఏ సెక్షన్ విద్యార్థి కే.బి ముగీలు కు ప్రధమ బహుమతిని అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తకాలు తయారు చేయాలంటే చెట్లను నరకాల్సిన అవసరం ఉందని అలా పర్యావరణాన్ని పరిరక్షించే చెట్లను కాపాడడానికి విద్యార్థి దశలోనే పిల్లలు వారి పాత పుస్తకాలను ఇచ్చి కొన్ని చెట్లు కాపాడుకోవడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో వావ్ ప్రతినిధి బి రాజు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News