Breaking News

రెడీ టు ఈట్ ఆహారం ముందస్తుగానే సమకూర్చుకోవాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో తుఫాన్ కారణంగా ఈనెల 27 నుండి 29వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా ప్రజలందరూ వారికి కావలసిన మంచినీరు, పాలు, పెరుగు, పండ్లు, కూరగాయలు, రెడీ టు ఈట్ ఆహారం ముందస్తుగానే సమకూర్చుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా తుపాను కారణంగా విద్యుత్ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున ముందుగానే పవర్ బ్యాంకు, మొబైల్లను పూర్తిస్థాయిలో ఛార్జింగ్ పెట్టుకుని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అలాగే కొవ్వొత్తులు, బ్యాటరీ లైట్లు, చార్జింగ్ ఎమర్జెన్సీ లైట్లు అందుబాటులో ఉంచుకోవాలనీ కలెక్టర్ తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఆ రోజుల్లో జిల్లా ప్రజలు అత్యవసరమైతే తప్ప ఎవరూ కూడా ఇంటి నుండి బయటకు వెళ్ళరాదని ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని జిల్లా యంత్రాంగానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *