మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదివారం ఉదయం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మంగినపూడి బీచ్ ను సందర్శించి అక్కడి వాతావరణ పరిస్థితులను పరిశీలించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న భారత వాతావరణ కేంద్ర హెచ్చరికల నేపథ్యంలో ఆయన సముద్ర తీరాన్ని సందర్శించి అలలు తాకిడిని పరిశీలించారు. తీర ప్రాంతంలోని మత్స్యకారులు వేట కోసం సముద్రంలోకి వెళ్లకుండా అప్రమత్తం చేయాలన్నారు. బీచ్ ప్రాంతంలో పర్యవేక్షణలో ఉన్న భద్రత పోలీస్ సిబ్బందితో మాట్లాడి సందర్శకులు ఎవరినీ కూడా లోపలకు అనుమతించవద్దని, నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మచిలీపట్నం ఆర్డీవో కే స్వాతి, మత్స్య శాఖ జిల్లా అధికారి అయ్యా నాగరాజా, రెవెన్యూ అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
Prajavartha Online Telugu News