-విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పింఛన్లు పంపిణీ పాల్గొన్న వెస్ట్ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల సామాజిక భద్రత, ఆర్థిక భరోసానే ప్రధాన లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 55వ డివిజన్ ఆరు పంపుల బావి సెంటర్ లో శనివారం ఎంపీ కేశినేని శివనాథ్ పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో వెస్ట్ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్ తో కలిసి పాల్గొన్నారు. లబ్ధి దారులతో స్వయంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడి..పెన్షన్ తో పాటు మహిళలకు,వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ పథకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు సారథ్యంలో పేదల సంక్షేమంలో ఎక్కడా రాజీ పడకుండా కూటమి ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పింఛన్లు పెంచి ఇస్తున్నట్లు వెల్లడించారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, సామాజికంగా వెనుకబడిన పలు వర్గాలకు ఆర్థికంగా చేయూత అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి నెలా రూ.4వేల నుంచి రూ.15వేల ఆర్థిక సాయం పింఛన్ రూపంలో లభిస్తుందన్నారు.
అలాగే ‘దీపం 2.0’ కింద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, ‘తల్లికి వందనం’ కింద పాఠశాలలకు వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.15వేలు, ‘స్త్రీ శక్తి’ కింద ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు ‘అన్నదాత సుఖీభవ’ కింద రూ.20 వేల పెట్టుబడి సాయం, ‘ఆటోడ్రైవర్ల సేవలో’ కింద ఆటో సోదరులకు రూ.15 వేలు, 5 రూపాయలకే టిఫిన్, భోజనం అందించే ‘అన్న క్యాంటీన్ల’ పునరుద్ధరణ తదితర పథకాలు పేదల జీవన ప్రమాణాలు మెరుగు పరచడానికి ఉపయోగ పడుతున్నాయన్నారు. అలాగే ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి పశ్చిమ నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో 55వ డివిజన్ ప్రెసిడెంట్ జాహీద్, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి ఎమ్.ఎస్.బేగ్, రాష్ట్ర మైనార్టీసెల్ ప్రధానకార్యదర్శి ఫతావుల్లాహ్, బిజెపి జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ , టిడిపి ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షుడు సొలంకి రాజు, తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆషా, తెలుగు మహిళ పశ్చిమ నియోజకవర్గ అద్యక్షురాలు సుఖాసి నరిత, గొల్లపూడి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాల మాధవ, బుద్దా ఆలయ చైర్మన్ పిళ్లా సుదర్శన్, సీనియర్ నాయకులు కామా దేవరాజు, డివిజన్ ప్రెసిడెంట్లు అజీజ్, దుర్గరావు, గంగాదర్,బడుగు వెంకన్న, కుంచం దుర్గరావు, రాంబాబు, అమర మురళీ, బుదాల నందకుమారి, నాయకులు అన్సర్, నహీద్, క్లస్టర్ ఇన్చార్జులు సుబ్బారెడ్డి, ధనేకుల సుబ్బారావు, సుభానీ, సుఖాసి కిరణ్ లతో పాటు ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News