-తిరువూరుకి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు ఎల్.వో.సి పత్రాలు అందజేత
-ఒకరికి రూ 4. లక్షలు, మరొకరికి రూ.లక్ష మంజూరు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని పేద ప్రజలు ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎంఆర్ఎఫ్ ద్వారా వారిని ఆదుకుంటున్నారు. సీఎం చంద్రబాబు ఎపిని అభివృద్ది పథం వైపు నడిపించటంతోపాటు, రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పెట్టుకున్నారని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో శనివారం సీఎంఆర్ ఎఫ్ కింద మంజూరైన ఎల్.వో.సి పత్రాలను ఎంపి కేశినేని శివనాథ్ ఇద్దరు లబ్ధిదారులకు అందజేశారు.
తిరువూరు నియోజకవర్గం ఎ.కొండూరు మండలం హరిజనవాడ కు చెందిన వి.నాగయ్య బ్రెయిన్ శస్త్రచికిత్స కోసం సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.4 లక్షల రూపాయల ఎల్.వో.సి పత్రాన్ని వారి కుటుంబ సభ్యులకు ఎంపి కేశినేని శివనాథ్ అందజేశారు. అలాగే తిరువూరు నియోజకవర్గం గంపల గూడెం మండలం చింతలనర్వ గ్రామానికి చెందిన గద్దెల వెంకటేష్ మోకాలి రీప్లేస్ శస్త్రచికిత్స కోసం సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.1 లక్ష రూపాయల ఎల్.వో.సి పత్రాన్ని వారి కుటుంబ సభ్యులకు ఎంపి కేశినేని శివనాథ్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎ.ఎమ్.సి మాజీ చైర్మన్ అలవాల రమేష్ రెడ్డి, సీనియర్ నాయకులు గొర్లా రమేష్ రెడ్డి , పి.ఎ.సి.ఎస్ ప్రెసిడెంట్ చిల్లపల్లి కృష్ణ, కంభం పాడు గ్రామపార్టీ సెక్రటరీ జవ్వాది రాంబాబు, విభన్న ప్రతిభావంతుల జిల్లా అధ్యక్షుడు పొన్నెబోయిన నాగేశ్వరరావులతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News