Breaking News

ఏపీని గ్లోబల్ టూరిజం మ్యాప్ పై సగర్వంగా నిలబెడతాం

-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
-లండన్ లో జరుగుతున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (డబ్ల్యూటీఎం)-2025 సమావేశంలో పాల్గొని ఏపీ పర్యాటక వాణి వినిపించిన మంత్రి దుర్గేష్
-డబ్ల్యూటీఎంలో భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్ ను డిప్యూటీ హై కమిషనర్, దేశంలోని వివిధ రాష్ట్రాల పర్యాటక మంత్రులతో కలిసి ప్రారంభించిన మంత్రి దుర్గేష్
-రాష్ట్ర సంస్కృతి ప్రతిబింబించేలా కూచిపూడి నృత్యంతో ఏపీ పర్యాటక స్టాల్ ను అక్కడి ప్రతినిధులతో కలిసి ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్
-20కి పైగా ఇంటర్నేషనల్ టూర్ ఆపరేటర్లు, ఇంటర్నేషనల్ హోటల్స్ ప్రతినిధులు, మైస్ ఇన్వెస్టర్లు, ఇంటర్నేషనల్ ట్రావెల్ మాగజైన్స్, ఇంటర్నేషనల్ మీడియా బ్లాగర్స్ తో విడివిడిగా చర్చించిన మంత్రి దుర్గేష్
-అంతర్జాతీయ ప్రతినిధులతో రాష్ట్రంలో పర్యాటక పెట్టుబడుల అవకాశాలపై, టూరిజం ప్యాకేజీలపై వివరణ
-ఏపీ పర్యాటకానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ వేదికపై ఏపీ పర్యాటక ఖ్యాతిని వివరించామని, ఏపీని గ్లోబల్ టూరిజం మ్యాప్ పై సగర్వంగా నిలబెడతామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. లండన్ లోని ఎక్సెల్ లండన్ వేదికగా నవంబర్ 4 నుండి 6 వరకు జరుగుతోన్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్ -2025 ఎగ్జిబిషన్ లో మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ లు పాల్గొని రాష్ట్ర పర్యాటక వాణిని వినిపించారు. తొలి రోజు మంత్రి కందుల దుర్గేష్ సారథ్యంలోని బృందం బిజీ బిజీగా గడిపింది. తొలుత భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్ ను డిప్యూటీ హై కమిషనర్, దేశంలోని వివిధ రాష్ట్రాల పర్యాటక మంత్రులతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర సంస్కృతి ప్రతిబింబించేలా కూచిపూడి నృత్యంతో ఏపీ పర్యాటక స్టాల్ ను అక్కడి ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. వరల్డ్ ట్రావెల్ మార్కెట్ వేదికగా ఏర్పాటు చేసిన ఏపీ స్టాల్ ద్వారా రాష్ట్రంలోని ప్రకృతి సహజ సిద్ధ ప్రదేశాలు, చారిత్రాత్మక కోటలు, సుదీర్ఘమైన తీర ప్రాంతం, వారసత్వ సంపదను ప్రపంచ దేశాల పర్యాటకులకు తెలిపేలా వరల్డ్ ట్రావెల్ మార్కెట్ వేదికగా ప్రచారం కల్పించారు. అదే విధంగా దాదాపు 20కి పైగా అంతర్జాతీయ టూర్ ఆపరేటర్లు, హోటల్స్ ప్రతినిధులు, మైస్ ఇన్వెస్టర్లు,ప్రఖ్యాత ట్రావెల్ మాగజైన్స్ యజమానులు, మీడియా బ్లాగర్స్, అడ్వెంచర్ ట్రావెల్ కంపెనీలు, టైలర్ మేడ్ ట్రావెల్ కంపెనీ, ఆన్ లైన్ ట్రావెల్ మీడియా, టూరిజం బోర్డులు, కృతి రిటైల్ వెంచర్స్ ఎల్ఎల్ పీ తో విడివిడిగా సమావేశమై రాష్ట్ర పర్యాటక రంగంలో ఉన్న పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను, ఏపీ పర్యాటక రంగ ప్రత్యేకతలను వివరించారు. ఏపీ స్టాల్ కు వచ్చిన అంతర్జాతీయ ప్రతినిధులకు ఏపీ సంస్కృతి ప్రతిబింబించేలా కూచిపూడి నృత్యంతో స్వాగతం పలికి, అరకు కాపీని అందజేశారు. ఆంధ్రా ఫేమస్ పూతరేకులు రుచి చూపించారు. జీఐ ట్యాగ్ పొందిన ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలను ప్రదర్శించి వాటి ప్రత్యేకతలను, తయారీ విధానాన్ని వివరించారు.పలువురికి వాటిని బహుమతులుగా అందించారు. అనంతరం అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడి రాష్ట్ర పర్యాటక రంగంలో తీసుకువచ్చిన నూతన పర్యాటక పాలసీ 2024-29, పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పన తదితర వివరాలను వెల్లడించి ఏపీలో పర్యాటక పెట్టుబడులను ఆహ్వానించారు. రాష్ట్ర పర్యాటక రంగంలో పెట్టుబడులు పెడితే భరోసా కల్పించే బాధ్యత మాది తెలిపారు. మంత్రి దుర్గేష్ భేటీ అయిన వారిలో పికాక్ టూర్ కంపెనీ సీఈవో కన్నన్ శివనాథన్, రష్యాతో పాటు వివిధ దేశాలకు చెందిన అంతర్జాతీయ ట్రావెల్ ఎగ్జిబిటర్లు, మైనా ట్రావెల్ ఎండీ, మైస్ ఇన్వెస్టర్లు, 500 హోటల్స్ చైన్ యాజమాన్యం, సిగ్నేచర్ హాస్పిటాలిటీ గ్రూప్ సీఈవో రమేశ్ అరోరా, రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి తదితరులు ఉన్నారు. హై కమిషనర్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన డిన్నర్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ పర్యాటకాన్ని విశ్వవ్యాప్తం చేయడమే తమ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *