Breaking News

ఆధ్యాత్మిక‌త సేవా స్పూర్తి క‌ల‌యిక కార్తీక మాసం వ‌న స‌మారాధ‌నలు

-తిరువూరులో ఆర్య‌వైశ్య సంఘం వ‌న‌స‌మారాధ‌న‌లో ఎంపీ కేశినేని శివ‌నాథ్ వెల్ల‌డి
-యంగ్ రైట‌ర్ నాళ్ల శ్రీ శ్రావ్య‌, ఎవ‌రెస్ట్ అధిరోహించిన గుడిమెట్ల రాముల‌ను స‌న్మానించిన ఎంపీ

తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కార్తీక మాసంలో ఏర్పాటు చేసే వ‌న‌స‌మారాధ‌న‌లు ఆధ్యాత్మిక‌త సేవా స్పూర్తి క‌ల‌యిక అని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. తిరువూరు ఆర్య‌వైశ్య సంఘం ఆధ్వ‌ర్యంలో ప‌ట్ణ‌ణంలోని బొడ్డు శ్రీను మామిడి తోట‌లో ఆదివారం ఏర్పాటు చేసిన వనసమారాధన కార్య‌క్ర‌మానికి ఎంపీ కేశినేని శివ‌నాథ్ ముఖ్యఅతిథిగా హాజ‌రయ్యారు.

ఈ కార్య‌క్ర‌మానికి విచ్చేసిన ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శావ‌ల దేవ‌ద‌త్, నియోజ‌క‌వ‌ర్గ అబ్జ‌ర్వ‌ర్ సుఖ‌వాసి శ్రీనివాస‌రావు ల‌కు ఆర్య‌వైశ్య సంఘం నాయ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం ఎంపీ కేశినేని శివ‌నాథ్ సంఘం నాయ‌కులు స‌న్మానించారు.

ఈ సంద‌ర్బంగా 8వ వార్డ్ కౌన్సిల‌ర్ నాళ్ల సురేంద్ర కుమార్తె రచించిన ది గ‌ర్ల బిటివిన్ లైన్స్ పుస్త‌కాన్ని ఆవిష్క‌రించారు. అలాగే ఎవ‌రెస్ట్ శిఖ‌రాన్ని అధిరోహించిన గుడిమెట్ల రామును అభినందించారు. అలాగే ఈ ఇరువుర్ని ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఘ‌నంగా స‌త్క‌రించారు.

ఎంపీ కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ ఆర్య‌వైశ్య సంఘం ఏర్పాటు చేసిన కార్తీక వ‌న స‌మారాధ‌న‌లో పాల్గొన‌టం ఎంతో ఆనందంగా వుంద‌న్నారు. ఆర్య‌వైశ్యుల అభివృద్ది, సంక్షేమం కోసం కృషి చేస్తాన‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో 8వ వార్డ్ కౌన్సిల‌ర్ నాళ్ల సురేంద్ర‌, ఆర్య‌వైశ్య‌సంఘం ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు గుడిమెట్ల ముర‌ళీ, ఆర్య‌వైశ్య సంఘం మండ‌ల అధ్య‌క్షుడు జంగాల ముర‌ళీ కృష్ణ‌, ఆర్య‌వైశ్య ప్ర‌ముఖులు బొడ్డు శ్రీనివాస‌రావు, తెలుగుదేశం పార్టీ మండ‌ల అధ్యక్షుడు దుబ్బాకుల వెంక‌టేశ్వ‌ర్లు, టిడిపి తిరువూరు ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు మ‌ల్లెల శ్రీనివాస‌రావు ల‌తో పాటు ఆర్య‌వైశ్య ప్ర‌ముఖులు, నాయ‌కులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *