Breaking News

కార్తీక వనభోజనం.. ఆత్మీయ సమ్మేళనం |

-కాపు వ‌న‌స‌మారాధ‌న లో ఎంపీ కేశినేని శివ‌నాథ్ వెల్ల‌డి
-వైద్య శిబిరంలో ప‌రీక్ష‌లు చేయించుకున్న ఎంపీ కేశినేని

తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అధ్యాత్మిక‌త , ఐక్య‌త స్నేహ‌భావాల‌కు కార్తీక మాస వ‌న‌భోజ మ‌హోత్స‌వాలు ప్ర‌తీక‌లని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. కార్తీక మాస వ‌న‌భోజ‌న మ‌హోత్స‌వాల ద్వారా ఆధ్యాత్మిక భావాలు సోద‌ర భావాలు పెంపొందటానికి దోహ‌ద‌ప‌డ‌తాయ‌న్నారు.

తిరువూరు కాపు సంఘం ఆధ్వ‌ర్యంలో ప‌ట్ణ‌ణంలోని బొడ్డు మ‌ల్లికార్జున‌రావు మామిడి తోట‌లో ఆదివారం ఏర్పాటు చేసిన వనసమారాధన కార్య‌క్ర‌మానికి ఎంపీ కేశినేని శివ‌నాథ్ ముఖ్యఅతిథిగా హాజ‌రయ్యారు.

ఈ కార్య‌క్ర‌మానికి విచ్చేసిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ కు కాపు సంఘం నాయ‌కులు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికటంతోపాటు ఘ‌నంగా స‌న్మానించారు. ఈ వ‌న స‌మారాధ‌న‌లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ఎంపీ కేశినేని శివ‌నాథ్ వైద్య ప‌రీక్ష‌లు చేయించుకున్నారు.

ఈ సంద‌ర్భంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ కార్తీక మాస వనభోజనాలతో ఐక్యత, స్నేహభావం పెంపొందుతుందన్నారు.

ఈకార్య‌క్ర‌మంలో కాపు సంఘం అధ్య‌క్షుడు రంగ‌య్య నాయుడు, హ‌య‌త్ ప్యాలెస్ అధినేత రామిశెట్టి వీరాస్వామి, పిఎసిఎస్ అధ్య‌క్షుడు కంచి ర‌ఘు ప్ర‌వీణ్ (బాబీ), జ‌న‌సేన రాష్ట్ర కార్య‌ద‌ర్శి విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జ్ అమ్మిశెట్టి వాసు, జ‌న‌సేన మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జ్ అక్క‌ల గాంధీ, జ‌న‌సేన తిరువూరు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త మ‌నుబోలు శ్రీను, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శావ‌ల దేవ‌ద‌త్, నియోజ‌క‌వ‌ర్గ అబ్జ‌ర్వ‌ర్ సుఖ‌వాసి శ్రీనివాస‌రావు, తెలుగుదేశం పార్టీ మండ‌ల అధ్యక్షుడు దుబ్బాకుల వెంక‌టేశ్వ‌ర్లు, టిడిపి తిరువూరు ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు మ‌ల్లెల శ్రీనివాస‌రావు ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *