Breaking News

ఘనంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్బంగా ఆలయంలో ఘనంగా నిర్వహించిన వసంతోత్సవంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వేలాది భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. డా. హరిప్రసాద్ తో పాటు సతీమణి గౌరీ, సోదరులు వెంకటేశ్వర ప్రసాద్, శివ ప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక సేవలు, పూజల్లో పాల్గొన్నారు. వసంతోత్సవం సందర్భంగా ఆలయ అర్చకులు సంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించిన పూజా కార్యక్రమాలను వీక్షిస్తూ కుటుంబ సభ్యులు అమ్మవారి దివ్యదర్శనాన్ని పొందారు. బ్రహ్మోత్సవాల మహోత్సవ వాతావరణంలో పాల్గొన్న హరిప్రసాద్ కుటుంబం ఆలయ కార్యక్రమాలకు అనుగుణంగా శాంతియుతంగా దర్శనం పూర్తి చేసుకున్నారు. పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే అవకాశం కలగడం తమకు ఆనందంగా అనిపించిందని వారి కుటుంబ సభ్యులు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *