కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త :
ఒక కుటుంబానికి ఒక వ్యాపారవేత్తను తయారుచేయాలనే సంకల్పంలో భాగంగా కుప్పంలో డ్వాక్రా మహిళలచే ఏర్పాటుచేసిన ఛాయ్ రాస్తా అవుట్‌లెట్‌ను ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరీ ప్రారంభించారు. రుచి, శుచి, నాణ్యత ప్రధానంగా కార్పొరేట్ తరహాలో ఏర్పాటైన ఛాయ్ రాస్తా అవుట్ లెట్‌లో ఆమె మొదటి ఛాయ్‌ని కోనుగోలు చేశారు.. చాయ్ రాస్తా అవుట్‌లెట్‌లో రుచి, శుచి చక్కగా ఉన్నాయని ఆమె ప్రశంసించారు. ఐఐఎం, ఐఐటి గ్రాడ్యుయేట్ల భాగస్వామ్యంతో రూపొందించిన చాయ్ రాస్తా చాలా సరికొత్తగా ఉందని ఆమె అభినందించారు. మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు కావాల్సిన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని దీనిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని భువనేశ్వరీ అన్నారు. కుప్పం డెవలప్‌మెంట్ ఆధారిటీ (కడా) మద్దతుతో ముందుగా కుప్పంలో ఈ ఛాయ్ రాస్తా అవుట్ లెట్ ప్రారంభం కావడం శుభపరిణామం అన్నారు. డ్వాక్రా మహిళలకు ప్రతి నెల స్థిరమైన ఉపాధితో పాటు వారికి గౌరవాన్ని కల్పించేలా ఛాయ్ రాస్తా అవుట్ లెట్‌లు పనిచేయన్నాయి. మెప్మా భాగస్వామ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాలు, నగరాల్లో ఛాయ్ రాస్తా అవుట్‌లెట్‌లు ప్రారంభం కానున్నాయి.
డ్వాక్రా మహిళలకు స్థిరమైన ఆదాయం, గౌరవం ఛాయ్ రాస్తా అవుట్ లెట్‌లతో లభిస్తుందని ఛాయ్ రాస్తా సీఈఓ మైకేల్ జోషి తెలిపారు.. మహిళలు ఎంతో సులువుగా ఛాయ్‌రాస్తా అవుట్ లెట్ నిర్వహించవచ్చని, ఆధునాతన టెక్నాలజీతో ఈ ఛాయ్ రాస్తా అవుట్ లెట్‌లు ఉంటాయని ఛాయ్ రాస్తా డైరెక్టర్లు పోలుదాసు కిరణ్, ఒంటిపులి పూర్ణచంద్రరావు తెలిపారు. ఛాయ్ రాస్తా అవుట్ లెట్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కడా ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News