Breaking News

అక్టోబర్ 7నుండి ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో అక్టోబర్ 7 వ తేదీ నుంచి 15వ తేదీ వరకు శ్రీ ప్లవనామ సంవత్సర దసరా మహోత్సవాలు అతివైభవంగా నిర్వహించడం జరుగుతుందని ధర్మకర్తల మండలి అధ్యక్షులు పైలా సోమనాయుడు, కార్యనిర్వహణాధికారి డి. భ్రమరాంబ ప్రకటన లో తెలిపారు.

శ్రీ అమ్మవారి దివ్య అలంకారముల వివరాలు :

7-10-2021ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి గురువారం రోజున శ్రీ స్వర్ణకవచాలంకరణ శ్రీ దుర్గాదేవి.

8-10-2021 విదియ శుక్రవారం రోజున శ్రీ బాలా త్రిపురసుందరి దేవి.

9-10-2021 తదియ శనివారం రోజున శ్రీ గాయత్రీ దేవి.

10-10-2021 చవితి ఆదివారం రోజున శ్రీ లలితా త్రిపురసుందరి దేవి.

11-10-2021 పంచమి,షష్ఠి సోమవారం రోజున శ్రీ అన్నపూర్ణ దేవి, శ్రీ మహాలక్ష్మీ దేవి.

12-10-2021శుద్ధ సప్తమి మంగళవారం రోజున శ్రీ సరస్వతీ దేవి(మూలా నక్షత్రం).

13-10-2021శుద్ధ అష్టమి బుధవారం రోజున శ్రీ దుర్గాదేవి(దుర్గాష్టమి).

14-10-2021శుద్ధ నవమి గురువారం రోజున శ్రీ మహిషాసురమర్దని(మహార్ణవమి).

15-10-2021శుద్ధ దశమి శుక్రవారం రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి(విజయదశమి).

11-10-2021తేదీ సోమవారం రోజున శుద్ధ పంచమి, షష్ఠి తిధులు వచ్చినందున శ్రీ అమ్మవారు మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం లోనూ, అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి శ్రీ మహాలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు.

15వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి కృష్ణా నదిలో హంసవాహన తెప్పోత్సవం జరుగుతుందన్నారు.

శ్రీ శివకామసుందరి దేవి అమ్మవారికి(ఉపాలయం)కూడా పేర్కొన్న విధంగా అలంకారములు ఉంటాయని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *