Breaking News

ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దేందుకు గ్రామస్థాయి కమిటీలు ప్రణాళికలను రూపొందించాలి… : యంపీపీ గద్దే పుష్పవాణి

-జగనన్న కాలనీల్లో లేఅవుట్లలో గృహనిర్మాణాల పురోగతి వేగవంతం చెయ్యాలి…
-యంపీడీవో వెంకటరమణ

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దేందుకు గ్రామ స్థాయి ప్రణాళికలను రూపొందించాలని ఎంపీపీ గద్దే పుష్పరాణి అన్నారు. బుధవారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో పంచాయితీ కార్యదర్శులు, ఇంజినిరింగ్ సిబ్బంది, ఎన్ఆర్ఇ జీఎస్ సిబ్బందితో విలేజ్ వర్క్స మరియు శానిటేషన్ కమీటీల ఏర్పాటు పై యంపీపీ గద్దే పుష్పవాణి యంపీడీవో అధ్యతన అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ అక్టోబరు 2 వ తేదీ గాంధి జయంతి నాటికి ప్రతి గ్రామంలో గ్రామ సర్పంచ్, యంపీటీసీ, వార్డు మెంబర్లు విలేజ్ వర్సు మరియు శానిటేషన్ గ్రామ స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ఈ కమిటీలు గ్రామ స్థాయిలో తాగునీరు, ఇంటింటికీ కుళాయి, మంచినీటి చెరువుల అభివృద్ది, శానిటేషన్, డ్రైనేజీ, మరుగుదొడ్లు, గ్రామాల్లో అంతర్గత రహదారులు నిర్వహణ అంశాలపై ముందుస్తు ప్రణాళికలను సిద్దం చెయ్యాలన్నారు. 2024 నాటికి ప్రతి ఇంటికీ కుళాయి అందించాలన్నదే జలజీవన్ మిషన్ ముఖ్యోద్దేశ్యమన్నారు. ఎంపీడీవో మాట్లాడుతూ జలజీవన్ మిషన్ పథకం ద్వారా గుడివాడ రూరల్ మండలం వేల్పూరు, సిద్దాంతంలోని అన్ని ఇళ్లకు కుళాయి కనెక్షన్లను అందించామన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల నిర్మాణం పై ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీడీవో ఏ. వెంకటరమణ మాట్లాడతూ జగనన్న లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణానికి సంబందించి ప్రతి వెల్పేర్, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, ఎన్ ఆర్ఇ జీఎస్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. లబ్దిదారులు ఇల్లు నిర్మించుకునేందుకు స్టీలు, సిమ్మెంట్, ఇసుక సిద్దంగా ఉందని నిర్మించుకునే విదంగా వారికి అవగాహన కల్పించాలన్నారు. సంబందిత అధికారులు వారికి నిర్థేశించిన లక్ష్యలను పూర్తి చెయ్యాలన్నారు. లక్ష్యాలు పూర్తి చేయకుంటే అటువంటి వారిపై ఉన్నతాదికారులు చర్యలు తీసుకోవడం జరుగుతుదన్నారు. గృహనిర్మాణ సంస్థ డీఈ రామోజీ నాయక్ మాట్లాడుతూ ప్రతి లబ్దిదారులు గృహనిర్మాణానికి సంబందించి మూడు విడతల్లో పేమెంటు చెల్లిస్తున్నామన్నారు. బెస్ మెంట్ లెవెల్ రూ.60వేలు, రూప్ లెవెల్ రూ.60 వేరు, స్లాబ్ లెవెల్ రూ. 60 వేలు రూపాయలు చెల్లిస్తున్నామన్నారు. గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులు, లబ్దిదారులతో సమావేశం మై గ్రామంలో నిర్మించే ఇళ్లకు సంబందించి మెటీరియల్ స్టోర్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
సమావేశంలో ఏఇ ఆర్డబ్ల్యూఎస్. వెంకటేశ్వరావు, హౌసింగ్ ఏఈ సుబ్బారావు, పంచాయితీ కార్యదర్శలు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, ఎన్ఆర్ఈ జీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *